త్రివిక్రమ్ నుంచి ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అరవింద సమేత రిలీజ్ హడావుడిలో ఉన్న మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్రాజెక్టును వెంకీతో చేస్తాడని అజ్ఞాతవాసి రిలీజ్ టైమ్ లోనే చెప్పేశారు. త్రివిక్రమ్ కోసం మరోవైపు బన్నీ కూడా వెయిట్ చేస్తున్నాడు

టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుసగా మల్టీస్టారర్ కథలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ్ నాని చేసిన దేవదాస్ ఆడియెన్స్ ముందు పరవాలేదనిపించింది. అయితే శ్రీరామ్ ఆదిత్య లాంటి యువ దర్శకుడు కాకుండా బడా దర్శకులు చేస్తే బావుంటుందని ఆడియెన్స్ ఆశపడుతున్నారు. రాజమౌళి చేస్తున్న మల్టీస్టారర్ రావడానికి చాలా సమయం పడుతుంది. 

అయితే త్రివిక్రమ్ నుంచి ఒక మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అరవింద సమేత రిలీజ్ హడావుడిలో ఉన్న మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్రాజెక్టును వెంకీతో చేస్తాడని అజ్ఞాతవాసి రిలీజ్ టైమ్ లోనే చెప్పేశారు. త్రివిక్రమ్ కోసం మరోవైపు బన్నీ కూడా వెయిట్ చేస్తున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. వెంకటేష్ అల్లు అర్జున్ లు ఇద్దరు కలిసి నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇద్దరితో వేరేగా సినిమా చేస్తాడని ఇన్ని రోజులు ఒక న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు ఒకే కథలో నటించబోతున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడే చెప్పలేము గాని త్రివిక్రమ్ చేతిలో మాత్రం ఒక స్ట్రాంగ్ మల్టీస్టారర్ కథ అన్నట్లు సమాచారం.