రచయిత నుంచి స్టార్ డైరక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే ఓ వర్గానికి అమితమైన ఇష్టం. ఆయన రాసే పంచ్ లు, జీవిత సత్యాలు జనం నీరాజనాలు పడుతూంటారు. డైలాగుల్లో పూరి జగన్నాథ్ స్దాయిలో తెలుగులో రాయిగలిగిన రైటర్ గా ఆయన తన స్టామినా ఇప్పటిదాకా వచ్చిన అనేక సినిమాల్లో చూపించుకున్నారు. ఆయన సినిమాలు కాపీ అన్నా మరొకటి అన్నా వందల కోట్లు వసూలు చేస్తూ స్టార్ హీరోలు తన చుట్టూ తిరిగేలా చేసుకునే సత్తా ఆయనకు ఉంది. తాజాగా ఆయన జూ.ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం అదే కథపై వర్క్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రెమ్యునేషన్ ఎంత తీసుకోబోతున్నరనే విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది.
 
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఇరవై కోట్ల రెమ్యునేషన్  అందుకుంటున్నట్టు  తెలుస్తోంది. అయితే కరోనా నేపధ్యంలో ఆయన్ను రేటు తగ్గించుకోమని అడిగే అవకాసం ఉందంటున్నారు. మరి త్రివిక్రమ్ రెమ్యునేషన్ పై కూడా కోత పడుతుందా, ఆయన ఒప్పుకుంటారా అనేది ఇండస్ట్రీ ముందున్న ప్రశ్న. ఇక ఇదే సినిమా నిమిత్తం ..ఎన్టీఆర్ కి నలభై కోట్ల రెమ్యునేషన్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కి నిర్మాతగా వాటా ఇచ్చారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, నందమూరి​ కల్యాణ్‌రామ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. 2021 ప్రారంభంలో షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ అన్నట్లుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారు.  ఈ నేపధ్యంలో  ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు నిర్మాతలు. పొలిటికల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అనన్యా పాండేని ... ఒక హీరోయిన్ గా ఎంపిక చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న ఫైటర్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్ కు సంభందించిన కొన్ని రషెష్ చూసి ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఆమెకు ఓకే చెప్పినట్లు సమాచారం. 

అలాగే  ఎన్టీఆర్‌ సరసన మెయిన్ హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనున్నారన్నది మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్లలో కియారా ఒకరు. భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. రాంచరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. అలానే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. హారికా హాసిని, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.