దర్శకుడు త్రివిక్రమ్ టాలీవుడ్ లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన సినిమాలంటే వంద కోట్లకు అటు ఇటుగా ఉంటాయి. కానీ అంతకుమించి వెళ్లిన దాఖలాలు లేవు. అయితే త్రివిక్రమ్ దగ్గర రెండు వేల కోట్ల బడ్జెట్ తో తీయగలిగే కథలు ఉన్నాయంటూ నటుడు సునీల్ చెబుతున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మూడొందల కోట్లతో సినిమాలు తీస్తున్నాడు. ఆ స్థాయిలో ఖర్చు పెట్టినా రాబట్టగలిగే సత్తా ఆయనకు ఉంది. ఛాన్స్ ఇస్తే త్రివిక్రమ్ కూడా ఆ రేంజ్ లో సినిమాలు తీయగలడని అంటున్నాడు సునీల్. గతంలో సునీల్, త్రివిక్రమ్ రూమ్మేట్స్ అనే సంగతి తెలిసిందే.

వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. అప్పట్లో త్రివిక్రమ్.. సునీల్ కి చాలా కథలు చెప్పేవాడట. అందులో రూ.500 కోట్ల బడ్జెట్ అవసరమయ్యే భారీ సినిమా కూడా ఉందని సునీల్ గుర్తు చేసుకున్నాడు.ఆ కథ ఇప్పుడు తీయాల్సివస్తే ఏకంగా రెండు వేల కోట్లు ఖర్చవుతాయని  అంటున్నాడు సునీల్.

త్రివిక్రమ్ అప్పట్లో తనకు చెప్పిన కథల్లో సగం కూడా వాడలేదని, త్రివిక్రమ్ ఇప్పుడున్న స్థానం చాలా తక్కువని.. తను ఇంకా ఎత్తుకు ఎదుగుతాడని ఊహించినట్లు సునీల్ చెప్పుకొచ్చాడు. ఒకట్రెండు సినిమాల తరువాత త్రివిక్రమ్ బాలీవుడ్ కి వెళ్లిపోతాడనుకున్నట్లు తన స్థాయి అలాంటిది అంటూ చెప్పుకొచ్చాడు.