షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎడిటింగ్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. అందులో భాగంగా ఆయన ముంబైకు వెళ్ళారు.

 ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ భీమ్లానాయక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎడిటింగ్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. అందులో భాగంగా ఆయన ముంబైకు వెళ్ళారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ఇండియాలో టెక్నికల్లీ , బ్రిలియెంట్ సౌండ్ ఇంజినీర్ Shadab Rayeen ఈ ప్రాజెక్టుకు పనిచేస్తున్నారు. ఆయన తమన్ చేసే సినిమాలు అన్నటికీ పనిచేస్తూంటారు. ఇప్పుడు భీమ్లా నాయక్ కు కూడా పనిచేస్తున్నారు. త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని Shadab Rayeen స్వయంగా ట్వీట్ ద్వారా తెలియచేసారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది. ఆల్రెడీ త్రివిక్రమ్ ఎడిట్‌లో అనేక మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. 

ఇక ఆ మధ్య విడుదలైన లాలా భీమ్లా సాంగ్ మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ పాటను సాంగ్‌ను తివిక్రమ్ రాసారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటకు తాజాగా డీజే వర్షన్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాట మాస్ బీట్స్ ‌తో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి నాలుగు పాటల్ని వదిలారు.

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలతో కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోందని అంటున్నారు. అందులో భాగంగానే భీమ్లా నాయక్ నైజాం హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.