టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ ఇటీవల 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. తన తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో చేయబోతున్నాడని టాక్.

ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే త్రివిక్రమ్ దగర మైత్రీ మూవీస్, డివివి దానయ్య అడ్వాన్సులు ఉన్నాయి. వీరితో సినిమాల సంగతి తేలకముందే ఆయన మరొక బ్యానర్ నుండి అడ్వాన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కొద్ది నెలల క్రితం నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద ఓ సినిమా చేయడానికి కోట్లలో త్రివిక్రమ్ అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ లేదా కళ్యాణ్ రామ్ తో అని కాకుండా.. ఎవరితోనైనా ఈ బ్యానర్ లో సినిమా చేయడానికి గాను ఇచ్చినట్లు సమాచారం.

అయితే త్రివిక్రమ్ ఇప్పట్లో ఈ బ్యానర్ కి సినిమా చేస్తాడా అంటే సందేహమే.. లైన్ లో రెండు బ్యానర్లు ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తయిన తరువాతే ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. మరోపక్క తన తదుపరి సినిమా హారికా హాసిని క్రియేషన్స్ లోనే చేస్తాడని టాక్.