టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటుంటారు. సినిమాలలో అతడి మాటలకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే తనను మాటల మాంత్రికుడు అని పిలవడంపై త్రివిక్రమ్ కొత్తగా స్పందించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ''పంచ్ ని కనిపెట్టినోడు.. నువ్ మాటల మాంత్రికుడు అని పిలిచినోళ్ళు.. ఆ ఇద్దరూ నా శత్రువులు.. 'నువ్వే కావాలి' సినిమాతోనే నేను ప్రాస ఆపేశాను. చాలా మంది ప్రాసలు ప్రారంభించడంతో నేను నా ఆలోచన చెప్పడం మొదలుపెట్టాను. 

ఆలోచనని ఎవరూ కాపీ కొట్టలేరు కదా.. పంచ్ కావాలని రాయను.. అది నా స్పాంటేనియస్ రియాక్షన్. రాసుకోవాల్సిన డైలాగులన్నీ మూడు, నాలుగు రోజుల్లో రాసుకుంటాను. పంచ్ అంటే ఏంటో అర్ధం కాదు.. విచిత్రంగా ఉంటుంది. ఎవరు కనిపెట్టాడో తెలియదు'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇటీవల త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అరవింద సమేత' సినిమా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అతడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.