కోబలి పవన్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్న ప్రాజెక్ట్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా కోబలి అనే ఓ సోసియో ఫాంటసీ చిత్రం రానుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడాజరుపుకుంది. కారణం ఏదైనా ప్రాజెక్ట్ సడన్ గా ఆపేశాను. ఆ తరువాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాలు రావడం జరిగింది.
 
ఈ ప్రాజెక్ట్ మూలనపడి దాదాపు ఏడేళ్లు అవుతుంది. ఐతే కోబలి సినిమాను మరలా పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ చిత్రం తరువాత త్రివిక్రమ్ చేపట్టే ప్రాజెక్ట్ ఇదేనంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇదే కనుక నిజం అయితే పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. అలాగే కోబలి టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా చర్చినీయాంశం అయ్యే అవకాశం ఉంటుంది. 

మరో వైపు పవన్ నాలుగు సినిమాలకు కమిటై ఉన్నారు. వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉండగా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. హరీష్ శంకర్ తో చేస్తున్న 28వ చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే పవన్ తన 29వ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తో ప్రకటించడం జరిగింది.