టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ఆయన డైరక్టర్ కాకముందే  మాటల మాంత్రికుడు అని పిలుచుకున్నారు.    వెనక ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకపోయినా, కలాన్ని నమ్ముకొని కాలానికి ఎదురుగా ముందుకు సాగాడు. చిన్న చిన్న ఆఫర్స్ ను సద్వినియోగం చేసుకున్న త్రివిక్రమ్..మాటల రచయితగా మంచిపేరు తెచ్చుకోవడమే కాకుండా..  స్టార్ హీరోలు, దర్శకుడు పొందిన స్థాయిని అందుకున్నాడు. 

తొలిసినిమా నువ్వే నువ్వే తో దర్శకుడిగా తన తాను నిరూపించుకున్న త్రివిక్రమ్.. అతడు సినిమాతో తన స్థాయి ఏమిటో.. తన సినిమా ఎలా ఉంటుందో సినిమా రంగానికి చూపించాడు. ఖలేజా, జులాయి, జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ ఆ,  వచ్చిన అరవింద సమేత  తర్వాత అలవైకుంఠపురంలో సినిమాతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్త్వం త్రివిక్రమ్ ది. త్వరలో ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయబోతున్న  త్రివిక్రమ్ మిత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌సం మ‌రోసారి మాట‌ల ర‌చ‌యిత‌గా మారాడు. 
`అప్ప‌య్య‌యుమ్ కోషియ‌మ్‌` కోసం త్రివిక్ర‌మ్ మ‌రోసారి మాట‌ల ర‌చ‌యిత‌గా మారాడు.

అంతే న్యూస్ అయితే చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ కి 10 కోట్లు రెమ్యునేషన్ ఇస్తున్నార‌న్న వార్త టాలీవుడ్ అంత‌టా సంచ‌న‌లం సృష్టిస్తోంది. అంతే కాదు.. ఈ సినిమా లాభాల‌లో ఆయ‌న‌కు 50 శాతం వాటా కూడా ఇస్తున్నారంటున్నారు‌. తెలుగులో ఓ ర‌చ‌యిత‌కి ఇంత స్థాయిలో రెమ్యునేషన్ ఇవ్వ‌డం..  టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారి. అయితే ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత మాత్ర‌మే కాదు. ఈ సినిమాకు క‌ర్త క‌ర్మ క్రియ కూడా. ఈ ప్రాజెక్టులోకి ప‌వ‌న్ ని తీసుకొచ్చింది ఆయ‌నే. అస‌లు ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచ‌న కూడా ఆయ‌నదే అని తెలుస్తోంది.