వెబ్ సిరీస్...త్రివిక్రమ్ సహకారం !

 మంచి రెమ్యునేషన్ వస్తుండడంతో స్టార్ డమ్ ఉన్నవారు  సైతం వీటి పట్ల ఆసక్తి చూపుతూ అటువైపు అడుగేస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ సారధ్యంలో కూడా ఓ వెబ్ సీరిస్ స్క్రిప్టు రెడీ అవుతున్నట్లు సమాచరం. 

Trivikram help to Web Series for netflix jsp

కరోనా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఓటీటి మార్కెట్ కు బాగా క్రేజ్ బాగా పెరిగింది.  దానికి తోడు థియేటర్లు మూతపడటంతో ఓటీటీలదే హవా అన్నట్టుగా వుంది. దీంతో అనేక ఓటీటీ కంపెనీలు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ పై కూడా దృష్టి పెడుతున్నాయి. అలాగే పెద్ద బ్యానర్స్ సైతం ఓటీటిలకు కంటెంట్ అందించటానికి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తూ స్టార్స్ ని , ఫిలిం మేకర్స్ ను అటువైపు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మంచి రెమ్యునేషన్ వస్తుండడంతో స్టార్ డమ్ ఉన్నవారు  సైతం వీటి పట్ల ఆసక్తి చూపుతూ అటువైపు అడుగేస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్ సారధ్యంలో కూడా ఓ వెబ్ సీరిస్ స్క్రిప్టు రెడీ అవుతున్నట్లు సమాచరం. 

తెలుగులో పెద్ద బ్యానర్ అయిన హారిక హాసినితో త్రివిక్రమ్ కు మంచి స్నేహం ఉంది. భాగస్వామ్యం కూడా ఉందని చెప్తూంటారు. అందులో నిజమెంత అనేది ప్రక్కన పెడితే...మంచి వెబ్ సిరీస్ తీయాలని నిర్మాణ సంస్థ హారిక హాసిని ప్రయత్నిస్తోందని వినికిడి. ఇప్పటికే స్క్రిప్ఠ్ వర్క్ కూడా పూర్తయిందని.. ఎనిమిది ఎపిసోడ్స్ గా రానున్న ఈ సిరీస్ ను భారీ ఎత్తున షూట్ చేస్తారట. ప్యాన్ ఇండియా  వెబ్ సిరీస్ గా చేస్తారట. 

ఈ సిరీస్ కోసం సరైన కథ కథనాలు రాయించడంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తన సహాయ సహకారాలు అందించాడని వినపడుతోంది. అలాగే ఇప్పటికే  నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద ఓటిటి నుంచి ఈ స్క్రిప్టుకు నిర్మాణ సంస్ద అప్రూవల్ కూడా తెచ్చుకుంది.  మే నాలుగో వారం నుండి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ సిరీస్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా అప్రూవల్ అయింది కాబట్టి, టెక్నికల్ కాస్ట్ వగైరా పనులను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే అఫీషియల్ గా సమాచారం ఏమీ లేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios