జులాయి సినిమాతో ఒకటైన ఈ కాంబో ఒకటవ్వడానికి ప్రధానం కారణం కొన్ని గొడవలు.. ఇతరులతో తలెత్తిన వివాదాలే కారణమని తెలుస్తోంది. ఇతర సినిమాలకు సహా నిర్మాతగా ఉన్న చినబాబు కొంచెం ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే నిర్మాతల వివాదాలతో కొంచెం తడబడ్డాడు. 

మెయిన్ గా ఖలేజా సినిమా సమయంలో ఆ అనుభవం బాగా నేర్చుకున్నాడు. ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆలస్యం అయ్యి ఎఫెక్ట్ జరిగిందని త్రివిక్రమ్ భావిస్తారు. ఇక అత్తారింటికి దారేది సినిమా దగ్గర రెమ్యునరేషన్ విషయంలో చిన్నగా విభేదాలు రావడంతో త్రివిక్రమ్ నోటీసులు కూడా పంపాడు. అయితే జులాయితో చినబాబుతో మంచి స్నేహం కుదరడంతో ఆయనే బెస్ట్ అని సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు. 

అజ్ఞాతవాసి దెబ్బ కొట్టినా కూడా వారి  స్నేహంలో ఏ మాత్రం తేడా రాలేదు. త్రివిక్రమ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇరువురు లాభ నష్టాలలో పాలుపంచుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన అరవింద సమేతతో కొంచెం సెట్ అయిన ఈ కాంబో నెక్స్ట్ బన్నీతో మరో సినిమా చేయడానికి సిద్ధమైంది. సొంత బ్యానర్ లోనే ముందుగా అల్లు అర్జున్ సినిమా చేయాలనీ అనుకున్నాడు. 

కానీ త్రివిక్రమ్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో అల్లు అరవింద్ చర్చలు జరిపి పాట్నర్ గా ఉండడానికి ఒప్పించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా భారీగా తెరకెక్కనుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చూద్దాం ఈ త్రిబుల్ కాంబో లో  వస్తోన్న సినిమా ఎలా ఉంటుందో..