'అజ్ఞాతవాసి' సినిమా డిజాస్టర్ తో త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ ల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపించాయి. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి నిర్మించిన 'ఛల్ మోహన రంగ' సినిమా ఈవెంట్ కు కూడా పవన్ ఒక్కడే రావడం, త్రివిక్రమ్ డుమ్మా కొట్టడంతో ఆ వార్తలు నిజమేమోనని అనుకున్నారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన త్రివిక్రమ్.. సినిమాల కారణంగా దూరమయ్యే స్నేహం కాదు మాది. అత్తారింటికి దారేది సినిమా సూపర్ సక్సెస్ అయిందని పవన్ నాకేం బహుమానాలు ఇవ్వలేదు. అజ్ఞాతవాసి విషయంలో నన్ను దూరమూ పెట్టలేదు. ఇప్పటికీ మేమిద్దరం టచ్ లోనే ఉన్నాం. జయాపజయాలు మాపై ఎలాంటి ప్రభావం చూపవు. పైగా అజ్ఞాతవాసి సినిమా ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లను పిలిచి డబ్బులు ఇచ్చేశారట. ఇక పవన్ స్పీచులు నేను రాసిస్తాననే మాటల్లో నిజం లేదు. నాకు రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదు.