సుచీలీక్స్ కొంత కాలం ఎఫెక్ట్ అయినా తిరిగి కోలుకున్న చెన్నై చిన్నది త్రిష మళ్లీ జోరు పెంచింది. నటిగా త్రిష తెరంగేట్రం చేసి సుమారు 15ఏళ్లు అయింది. అయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. హీరోయిన్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ ఖుషీ.ఖుషీగా గడుపుతోంది. ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలు పూర్తి చేసి మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది.

 

తను నటిస్తున్న మోహిని, గర్జన, చతురంగవేట్టై-2 సినిమా షూటింగులు పూర్తి అయ్యాయని త్రిష తెలిపింది. చదరంగవెట్టై-2లో అరవింద్ స్వామికి దీటుగా నటించానని చెప్తోంది. గర్జన, మోహిని చిత్ర కథనాలు తన పాత్ర చుట్టూ తిరుగుతాయని చెప్పింది. గర్జన సినిమాలో ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో రిస్క్ చేసిందట. చిత్ర యూనిట్ డూప్ పెట్టుకోమన్నా.. తానే స్వయంగా నటించిందట. తన నటనను చూసి ఆమె తల్లి ఉమాకృష్ణన్ ఆశ్చర్యపోయారని అంటోంది. ప్రస్తుతం సమ్మర్ టూర్‌గా రోమ్ దేశాలు వెళ్తోందట. టూర్ పూర్తయిన వెంటనే విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నానని త్రిష సమాచారమిచ్చింది.