సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై పలు ఆలోచనలు చేసిన చిత్రబృందం ఫైనల్ గా త్రిష దగ్గర ఆగింది

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై పలు ఆలోచనలు చేసిన చిత్రబృందం ఫైనల్ గా త్రిష దగ్గర ఆగింది. రజినీకాంత్ సరసన హీరోయిన్ గా త్రిషని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే రజినికాంత్ తో కలిసి నటించడం పట్ల త్రిష బాగా ఎగ్జైట్ అవుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ.. 'కొన్ని సార్లు నిద్ర లేచిన తరువాత కూడా ఇంకా కలలోనే ఉన్నామనిపిస్తుంది' అంటూ ట్వీట్ చేసింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా దాదాపు అగ్రహీరోలందరితో జోడీ కట్టిన త్రిష ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా మారింది.

ఇప్పటివరకు ఆమె రజినీకాంత్ తో కలిసి నటించింది లేదు. తొలిసారి తలైవా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. 

Scroll to load tweet…