రానాకు పెళ్లి అవటం త్రిషకు మానసికంగా కాస్తంత రిలీఫ్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంక మీడియా వీళ్లిద్దరి గురించి రాయదు. దాంతో త్రిష ఉత్సాహంగా ఉందిట. అదే సమయంలో మూడేళ్లుగా రిలీజ్ కు నోచుకోని ఆమె సినిమా ఒకటి అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అది కూడా ఆమెకు సంతోషం కలిగించే విషయంగా మారింది. 
 
 
విపరీతమైన పోటీ వున్న ఈ రంగంలో గత రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా కొనసాగడం అంటే మాటలు కాదు. అది అందాలతార త్రిషకు సాధ్యమైంది. తను వచ్చి ఇరవై ఏళ్లు గడిచినా.. తనకి 37 ఏళ్లు వచ్చినా.. డిమాండ్ తగ్గకుండా ఇంకా అగ్ర స్థానంలోనే వుండి, సినిమాలు చేస్తున్న హీరోయిన్ తను.

తెలుగులో ఆఫర్స్ తగ్గినా,  తమిళంలో త్రిష కెరీర్ ఏమాత్రం సడలలేదు. కొత్త అమ్మాయిలు ఎందరు వచ్చినా తనకు వచ్చే సినిమాలు ఆమెకి వస్తూనే వున్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి త్రిష చేసిన చిత్రం 'శతురంగ వెట్టయ్ -2'. అయితే, వివిధ కారణాల వల్ల ఇది ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకుంది. కాబట్టి థియేటర్లలో రిలీజ్ కాలేకపోయినా, త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా రిలీజ్ కానుంది. 

టాలీవుడ్‌లో అంతంత‌మాత్రం అవ‌కాశాలు ఉన్న ఈ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో రీఎంట్రీ ఇస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఆ సినిమా నుంచి వైదొల‌గిన‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. కాగా రానా, త్రిష డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఎన్నో వార్తలు వెలువ‌డ్డాయి. దీనిపై ఓ కార్య‌క్ర‌మంలో స్పందించిన రానా ఆమెతో ఉన్న‌ అనుబంధం గురించి మాట్లాడుతూ.. త్రిష త‌న‌కు ద‌శాబ్ద కాలంగా మిత్రురాల‌ని పేర్కొన్నాడు. 

 స్వీయ నిర్భంధంలో ఉన్న నా  ఇద్ద‌రు  ఫ్రెండ్స్ రానా ద‌గ్గుబాటి, అల్లు అర్జున్‌ మంచి కంపెనీ ఇచ్చార‌ని చెప్పుకొచ్చింది.ఇటీవల విజయ్‌ సేతుపతితో రొమాన్స్‌ చేసిన 96, రజనీకాంత్‌తో జత కట్టిన పేట చిత్రాల విజయాలు మరింత నూతనోత్సాహాన్నిచ్చాయి. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తయారు చేసిన కథతో శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో పాటు మరో కొత్త చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న ఈ బ్యూటీ అంతకుముందు నటించిన చతురంగవేట్టై, తను సెంట్రిక్‌ పాత్రలో నటించిన పరమపదం విళైయాట్టు, గర్జన చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి.