Asianet News TeluguAsianet News Telugu

త్రిష వేదాంతం... అంతకన్నా చేసేదేముంది

  • సుచీ లీక్స్ పై స్పందించిన త్రిష
  • ఎవరి పాపాన వాళ్లే పోతారంటూ వేదాంతం
  • అంతకన్నా స్పందించటానికి ఏముందని గుసగుసలు
trisha reacts on suchi leaks picture

సుచీ లీక్స్ పేరుతో ట్విట్టర్ లో గత రెండు మూడు రోజులుగా లీకవుతున్న ఫోటోలు, వీడియోలు దక్షిణాది సినీ పరిశ్రమల ప్రముఖులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తమిళ సింగర్ సుచిత్ర కార్తీక ట్విట్టర్ పేజీ ద్వారా పలువురు సినీ తారలకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు....ఇతర స్టార్లతో చేస్తున్న రొమాన్స్ ఫోటోస్ లీక్ అవుతున్నాయి. రజనీకాంత్ అల్లుడు ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సింగర్ చిన్మయి, దగ్గుబాటి రానా, త్రిష, హన్సిక ఇలా పలువురి ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. హీరోయిన్ సంచితశెట్టికి సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అవ్వడం మరోసారి ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. దీనిపై అవి నావి కావంటూ ఆమె స్పందించింది. అయితే.. త్రిష మాత్రం తన ఫోటోలు లీక్ చేయడంపై కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది.

 

పదేళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష ఇప్పటికీ క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిషను హఠాత్తుగా వార్తల్లోకి లాగింది సింగర్‌ సుచిత్ర ట్వీట్. ధనుష్‌, రానాలతో త్రిష కిస్సింగ్‌ ఫొటోలను సుచిత్ర తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. త్రిషతోపాటు ఇతర హీరోహీరోయిన్ల ఫొటోలు, వీడియోలు కూడా సుచీలీక్స్‌ నుంచి బయటకు వచ్చాయి. కానీ, వారెవరూ స్పందించలేదు. త్రిష మాత్రం 'కర్మ' గురించి కోట్‌ చేసి ఇండైరెక్ట్‌గా సుచీలీక్స్‌ గురించి స్పందించింది.

 

తను ట్వీట్ చేసిన ట్వీట్ లో.. 'పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని విశ్రాంతిగా చూస్తూ ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన వారు.. వారంతట వారే నాశనం అయిపోతారు. మీకు అదృష్టం ఉంటే.. వాళ్ల నాశనాన్ని మీ కళ్లతో చూసే అవకాశం దేవుడు మీకు ఇస్తాడు' అంటూ చాలా ఘాటుగా స్పందించింది త్రిష. ఇలా వేదాంతం వళ్లించడం తప్ప చేసేదేముందిలేండి.

 

Follow Us:
Download App:
  • android
  • ios