ఇన్ని రోజులు సోలో హీరోయిన్ గా త్రిష చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కానీ '96' సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించి తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకుంది. మంచి పాత్రలు పడితే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సత్తా త్రిషకి ఉందని '96' సినిమా నిరూపించింది. ఈ సినిమాతో సీనియర్ హీరోలకి ఆమె బెస్ట్ ఆప్షన్ అయింది.

అయితే తనకి వచ్చిన ప్రతీ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేదు ఈ బ్యూటీ. పైగా ఇప్పుడు ఆమె నిర్మాతలకు కొన్ని షరతులు కూడా విధిస్తోంది. ఓ సీనియర్ తెలుగు హీరో నటించనున్న సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకోవాలని నిర్మాత ఆమె సంప్రదించగా.. రెమ్యునరేషన్ గా త్రిష రెండు కోట్లు డిమాండ్ చేసిందట.

అంతేకాదు.. సినిమాలో గ్లామర్ షో చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిందట. ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు.. ఆమె దగ్గరకి వస్తోన్న నిర్మాతలకి ఇవే షరతులు విదిస్తోందట. గతంలో ఈ బ్యూటీ సీనియర్ హీరోల పక్కన నటించిన సినిమాలలో గ్లామర్ ఒలకబోసింది. కానీ అవేవీ ఆమెకి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. కానీ ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సింపుల్ మిడిల్ ఏజ్ మహిళ పాత్రలో నటించిన '96' సినిమా మాత్రం ఆమెకి చక్కటి గుర్తింపు తీసుకొచ్చింది.

అందుకే తన పాత్రలు ఆ విధంగానే ఉండాలని భావిస్తోందట. కానీ ఈమె పెట్టే రూల్స్ కి మాత్రం నిర్మాతలు పారిపోతున్నారట. ఆమెను సంప్రదించిన సదరు తెలుగు ప్రొడ్యూసర్ కూడా వెనక్కి వచ్చేశాడు!