పవన్ కళ్యాణ్ సరసన మరోసారి త్రిష వేదాళం రీమేక్ కోసం త్రిషను సంప్రదిస్తున్న టీమ్ ఇప్పటికే రజినీ సరసన ఛాన్స్ కొట్టేసిన త్రిష
సౌత్ లో త్రిష ఇద్దరు ఫేవరేట్ హీరోలు .ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. తీన్ మార్ మూవీ కోసం పవన్ తో కలసి పని చేసింది త్రిష. అయితే ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు మరోసారి జంట ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతోందని టాక్ వినిపిస్తోంది. నీసన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న వేదాళమ్ రీమేక్ మూవీ కోసం త్రిషను సంప్రదిస్తున్నారట.
హైడోస్ యాక్షన్ మూవీలో హీరోయిన్ కి స్కోప్ తక్కువగా ఉంటుంది. అందుకే ముందు నయనతార, రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నా...ఇప్పుడు వారిద్దరినీ పక్కన పెట్టి త్రిషను లైన్ లో కి తీసుకురావాలనుకుంటున్నాడట పవర్ స్టార్. తమ కాంబినేషన్ లో వచ్చిన తీన్ మార్ మూవీ ఫ్లాపైంది. ఇప్పుడు వేదాళమ్ రీమేక్ తో హిట్ జోడీ అనిపించుకోవాలని చూస్తున్నాడట పవన్. గతంలో ఐరెన్ లెగ్ ముద్ర పడ్డ శృతి హాసన్ ను గబ్బర్ సింగ్ తో గోల్డెన్ లెగ్ ని చేసాడు. ఇప్పుడు కొత్త సినిమాలో ఆఫర్ అందించి త్రిష కెరీర్ కి హెల్ప్ చేసే ఆలోచన చేస్తున్నాడట పవన్.
