త్రిషకు అరుదైన గౌరవం ఇచ్చిన యునిసెఫ్

First Published 20, Nov 2017, 8:16 PM IST
trisha gets unicef award for her work on social issues
Highlights
  • త్రిషకు అరుదైన గౌరవం
  • యునిసెఫ్ సెలెబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఎంపికైన త్రిష
  • యువత హక్కులపై చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా హోదా

 

హిరోయిన్ త్రిషకు అరుదైన పురస్కారం దక్కింది. యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఆమె ఎంపికైంది. చిన్నారులు, యువత హక్కులను కాపాడేందుకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్లు యునిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. చెన్నైలో ఆదివారం (నవంబర్ 19) నిర్వహించిన ఓ కార్యక్రమంలో నటి త్రిషకు ఈ పురస్కారం అందచేశారు.

 

గతంలో అమితాబ్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఎనీమియా (రక్తహీనత), బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై వేధింపులు తదితర అంశాల్లో పిల్లలకు అవగాహన కల్పించడానికి త్రిష గత కొంత కాలంగా విశేష కృషి చేస్తోంది. ప్రత్యేకించి తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో ఆమె చాలా మంది చిన్నారులకు మద్దతుగా నిలిచింది.

‘పిల్లల్లో ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై అవగాహన కల్పించడానికి మరింతగా కృషి చేస్తా. చిన్నారులపై.. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాలబాలికలపై జరుగుతున్న దాడులు గర్హనీయం. అలాంటి వాటి నుంచి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని ఈ సందర్భంగా త్రిష పేర్కొంది.

 

దక్షిణ భారతదేశం నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి నటి త్రిషే కావడం విశేషం. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని త్రిష పేర్కొంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరింత ఉత్సాహంగా పని చేస్తానని ఆమె తెలిపింది. కార్యక్రమం సందర్భంగా సుమారు 50 మంది చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడింది.

 

loader