మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). మూవీ నుంచి రీసెంట్ గా ‘బాస్ పార్టీ’ విడుదలై సాలిడ్ వ్యూస్ ను దక్కించుకుంటోంది. మరోవైపు సినిమా నుంచి ఇప్పటికే రావాల్సిన కీలకమైన అప్డేట్ పై ఆసక్తి నెలకొంది. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ (Valtair Veerayya). దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తికావచ్చింది. మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకూ రానుంది. ఈ క్రమంలో అభిమానుల్లో జోష్ పెంచేందుకు మేకర్స్ క్రేజీ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సింగ్ ‘బాస్ పార్టీ’ (Boss Party)కి మాస్ రెస్పాన్స్ దక్కుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గతనెల 23న విడుదలైన ఈ మాస్ సాంగ్ కు మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. యూట్యూబ్ వేదికన వచ్చిన బాస్ పార్టీ ఇప్పటి వరకు 20 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. చిరంజీవి వింటేజ్ లుక్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా మాస్ స్టెప్పులకు ఫ్యాన్ ఫిదా అవుతున్నారు. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ మెగాస్టార్ కోసం క్రేజీ ట్యూన్ ను అందించారు. ప్రస్తుతం ఈ మాస్ బీట్ అంతటా మారుమోగుతోంది. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ హిట్ గా నిలవడంతో మిగితా పాటలపై ఆసక్తి నెలకొంది. ‘ఖైదీ నెం.150’ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ‘వాల్తేరు వీరయ్య’ విడుదలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. గతంలో సినిమాను వచ్చే ఏడాది 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’, తమిళ స్టార్ విజయ్ తళపతి చిత్రం ఉన్నాయి. ఈ క్రమంలో ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ను కూడా కన్ఫమ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. త్వరగా రిలీజ్ డేట్ ను విడుదల చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా బాలయ్య, చిరు మధ్య గట్టి పోటీ ఉండటంతో సంక్రాంతి మరింత ఆసక్తికరంగా మారనుంది.

మూవీలో చిరంజీవి ఊరమాస్ లుక్ లో అలరించబోతున్నారు. మెగాస్టార్ సరసన గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడుతోంది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రను పోషించడం మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

Scroll to load tweet…