సీనియర్ హీరో వెంకటేష్ చాలా సెలెక్టెడ్ గా కథలు ఎన్నుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అందుకే సినిమా సినిమాకు మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంటోంది. 'గురు' సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని 'ఎఫ్ 2' సినిమాలో నటించాడు.

త్వరలోనే 'వెంకీ మామ' సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు. ఇంతలోపే తన ఆరోగ్యం అన్ని విధాలా ఫిట్ గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వైజాగ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనకున్న బ్యాక్ పెయిన్ ని తగ్గించుకోవడం కోసం వైజాగ్ లో నేచర్ క్యూర్ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

వారం రోజుల పాటు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటారట. ఈ ట్రీట్మెంట్ కి సంబంధించిన సిట్టింగ్స్ పూర్తయిన తరువాత తిరిగి హైదరాబాద్ కి వస్తారట. ప్రస్తుతం తనకు షూటింగ్ లేవీ లేకపోవడంతో వెంకీ ట్రీట్మెంట్ కోసం వెళ్లిపోయాడు. 'వెంకీ మామ' సినిమా పూర్తయ్యేలోపు మరో కథను కూడా ఫైనల్ చేయాలని చూస్తున్నాడు వెంకీ.