కాస్టింగ్ కౌచ్ కో ఆర్డినేటర్ తో టీపీసీసీ కీలక నేతకు సంబంధాలు

కాస్టింగ్ కౌచ్ కో ఆర్డినేటర్ తో టీపీసీసీ కీలక నేతకు సంబంధాలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై ఒక్కొక్కరుగా బాధిత హిరోయిన్లు, అవకాశాలు రాక మోసపోయిన వర్థమాన హిరోయిన్లు గొంతెత్తుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మీటూ హ్యాష్ ట్యాగ్ తో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలువురు హిరోయిన్లు సోషల్ మీడియాలో స్పందిస్తన్న సంగతి తెలిసిందే.

 

తాజాగా తెలుగులో అలా మోసపోయిన వర్థమాన నటి శ్రీ రెడ్డి గత కొన్ని రోజులుగా బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనను మోసం చేసిన కొందరి గురించి మాట్లాడిన శ్రీ రెడ్డి.. అకాశాలు ఇవ్వకుండా కో ఆర్డినేటర్లు వాడుకుని ఎలా వదిలేస్తారో వివరించింది. తనను మోసం చేసిన  కో ఆర్డినేటర్ చాంద్ ఖాన్ బండారం బట్టబయలు చేసింది.

 

హిరోయిన్ కో ఆర్డినేటర్ గానే కాక ఈవెంట్ మేనేజర్ గానూ వ్యవహరించే చాంద్ ఖాన్... పలువురు ఆశావహ హీరోయిన్లతో అసభ్యంగా మాట్లాడటమే కాక.. ట్రాప్ చేసేందుకు ప్రయత్నాలు చేయటం, కాజల్ అగర్వాల్ స్థాయికి తీసుకెళ్లే అంత నెట్ వర్క్ నాకుంది అంటూ చెప్పి లోబరుచుకోవటం లాంటి కార్యక్రమాలు చేశాడు. ఈ కో ఆర్డినేటర్ చాంద్ ఖాన్ తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో వున్న నేత ఒకరు సంబంధాలు నెరపడం చూస్తే పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ నేతతో కలిసి కొందరు ముద్దుగుమ్మలు, హిరోయిన్ కో ఆర్డినేటర్ చాంద్ ఖాన్ రాసలీలల ఫోటోలు లీకయ్యాయి. దీన్ని బట్టే సినిమా మాఫియాతో రాజకీయాలకు ఏ రకమైన సంబంధాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ నేత గూడూరు నారాయణ రెడ్డి ప్రస్థుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page