Asianet News TeluguAsianet News Telugu

#Adipurush:VFX వర్క్ మేం చేయలేదు,వాటితో మాకు సంబంధం లేదని సంస్ద ప్రకటన

రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమా గుర్తొస్తుందంటూ, కొన్ని సీన్స్ అయితే కింగ్ కాంగ్ లాంటి సినిమాలు గుర్తొచ్చేలా చేస్తున్నాయంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. 

Top VFX Company Issued Clarification On Working For Adipurush
Author
First Published Oct 4, 2022, 11:57 AM IST


ఆదిపురుష్‌ టీజర్ విడుదలైంది. దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అదే సమయంలో  టీజర్ అద్భుతంగానే ఉందంటూ డార్లింగ్ అభిమానులు అంటున్నారు. ఎవరేమన్నా  అనుకున్న స్థాయిలో లేదనేది నిజం. టీజర్ చూస్తుంటే.. మొత్తం యానిమేషన్ అన్నట్టుగానే సాగింది. ఒక రూంలోనే షూటింగ్ అంతా చేసేసి గ్రీన్ మ్యాట్‌తో సినిమాను చుట్టేసినట్టు కామెంట్స్ వస్తున్నారు. మరో ప్రక్క పొన్నియన్ సెల్వన్ దెబ్బతో  ఇప్పుడు తమిళ ప్రేక్షకులు మన మీద గుర్రుగా ఉన్నారు. వారు అయితే ఈ సినిమాను కొచ్చాడియన్‌తో పోలుస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇదంతా ప్రక్కన పెడితే ..ఈ గ్రాఫిక్స్ చేయలేదు మహా ప్రభో అంటూ ఓ విఎఫ్ ఎక్స్ కంపెనీ వారు ముందుకు వచ్చి ప్రకటన ఇచ్చే స్దాయిలో ట్రోలింగ్ జరిగింది.

“ఆదిపురుష్” టీజర్‌కు వస్తున్న విపరీతమైన ట్రోల్స్ మరియు విమర్శలకు ప్రతిస్పందనగా, నటుడు అజయ్ దేవగణ్ యాజమాన్యంలోని టాప్ VFX కంపెనీ “VFX వాలా” వారు ప్రాజెక్ట్‌లో పని చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ అవుతున్న నోట్, మీడియా సంస్థలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పేర్కొంది. ఈ VFX ని చాలా మంది తామే చేసామంటూ తమ సంస్దను సైతం ట్రోల్ చేస్తున్నారని, అందుకే ఈ ప్రకటన జారీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

వాస్తవానికి అంతర్జాతీయ సంస్థలతోనే గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులు చేయించారు . అయితే ఇందులో రియాల్టీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. యానిమేషన్ ఎలిమెంట్స్ ప్రభాస్‌కు బాడీ తగిలించినట్టుగా.. గ్రాఫిక్స్‌లో అడ్జస్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది తప్పించి.. ఒరిజినల్ కాదంటూ జనాలు అంటున్నారు. ఇదంతా కూడా చిన్నప్పుడు డిస్నీ చానెల్లో చూసినట్టుగా అనిపిస్తోందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. 

వానర సేన కూడా గొరిల్లాలా కనిపిస్తున్నాయేంటంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆదిపురుష్ టీజర్ మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆంజనేయుడు సైతం కొత్తగా, వింతగా కనిపిస్తున్నాడంటూ  ట్రోల్స్ చేస్తున్నారు. 

ఈ చిత్రం 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో రూపొందించబడింది, వీటిలో ఎక్కువ భాగం VFX కోసం ఖర్చు చేయబడింది. కానీ ప్రేక్షకులకు అందించిన అవుట్‌పుట్ ప్రేక్షకులు ఆశించిన దానికి దూరంగా ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీమ్స్ మరియు ట్రోల్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా చిత్ర నిర్మాతలను ట్రోల్ చేస్తూ అభిమానులు తమ ఎమోషన్స్ ని వెల్లడిస్తున్నారు.  ‘ఆదిపురుష్’కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ మొదలుపెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios