రిలీజ్ కు ముందు ఈ సినిమా ఓటిటి రైట్స్ కు మంచి ఆఫర్ వస్తే ఆమె ఆపేసిందని, ఇదే దెబ్బ కొట్టిందని అంటన్నారు. దాంతో నిర్మాత గోలెత్తిపోతున్నారట.
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ‘ధక్కడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఈ వారం వచ్చిన సంగతి తెలిసిందే. 2019 మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ తర్వాత పూర్తి స్థాయి యాక్షన్ ఫిల్మ్ తో కంగన రనౌత్ చేసిన రెండవ ప్రయత్నం ఇది. ఈ మూవీపై తను పూర్తి నమ్మకంతో కనిపించింది. ఈ చిత్రంలో రనౌత్ క్రైమ్ వార్ నేపథ్యం యాక్షన్ చిత్రాలను ఆదరించేవారికి స్పెషల్ ట్రీట్ అని భావించారు.ఇదో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసారు. ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్ చేసింది. డేర్ డేవిల్ కంగనా 14 నిమిషాల పాటూ సాగే సుదీర్ఘమైన ఫైట్స్ లో కనిపించింది.అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది.ఎంతో నమ్మకంగా ఈ చిత్రం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా గోలెత్తిపోతున్నారు. దాదాపు 70 కోట్ల రూపాయలు దాకా థియోటర్ సర్క్యూట్స్ లోనే నష్టం వచ్చిందని అంచనా. ఇది కంగనాకు పెద్ద షాక్. అయితే ఇప్పుడు మరో షాక్ ఆమెకు ఎదురైంది.
ఈ చిత్రం ఓటిటి రిలీజ్ విషయంలో చుక్కెదరు అవుతోంది. ఈ సినిమాని తీసుకోవటానికి ఏ ఓటీటి సంస్దా ముందుకు రావటం లేదు. అమేజాన్, నెట్ ప్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ వంటి సంస్దలు ఫ్లాప్ సినిమాలు తీసుకుంటాయి. ఏదో రేటుకు ఫిక్స్ చేసి స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంటాయి. అయితే ఇప్పుడా సంస్దలు అన్ని కూడా నో చెప్పేసినట్లు సమాచారం. దాంతో ఈ సినిమా ఓటిటి రిలీజ్ చాలా కష్టం అంటున్నారు. రిలీజ్ కు ముందు ఈ సినిమా ఓటిటి రైట్స్ కు మంచి ఆఫర్ వస్తే ఆమె ఆపేసిందని, ఇదే దెబ్బ కొట్టిందని అంటన్నారు. దాంతో నిర్మాత గోలెత్తిపోతున్నారట.
ఇంత కాలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసిన కంగనా ఇందులో ఒళ్లు గగుర్పొడిచే ఫైట్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. తొలి రోజు ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా వచ్చిన నెట్ వసూల్లు రూ.50 లక్షలే అని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్లో సినిమా రూ.5 కోట్లు కూడా వసూలు చేసేలా లేదు. అందులోనూ ‘భూల్ భూలయియా-2’ లాంటి ఎంటర్టైనర్‌తో కంగనా సినిమా పోటీ పడింది. ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక దాని ముందు కంగనా సినిమా నిలవడం చాలా కష్టమైంది.
ఫైనల్ గా ‘ధాకడ్’కు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్ప లేదు. ఈ సినిమా గురించి కంగనా చెప్పుకున్న గొప్పలు అన్నీ ఇన్నీ కావు. హాలీవుడ్ సూపర్ హీరోయిన్ సినిమాల తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ చిత్రంతో ఇండియాలో తనకు ‘సూపర్ ఉమన్’ తరహా ఇమేజ్ వచ్చేస్తుందని కంగనా భావించింది. కానీ అదేమీ వర్కవుట్ కాలేదు.
