బిగ్ బాస్ సీజన్1 ను ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో నడిపించి రక్తికట్టించారు. ఇప్పుడు సీజన్ 2కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ మెల్లగా పుంజుకుంటోంది. అయితే ఈ షో కనపడే సెలబ్రిటీలు మేకప్ లేకుండానే ఉండాలి. మొదటి సీజన్ లో కూడా అందరూ అలానే కనిపించారు. ఇప్పుడు హౌస్ లో ఉన్నవాళ్ల పరిస్థితి కూడా అంతే..

తేజస్వి మదివాడ, భానుశ్రీ, శ్యామల వంటి వారు మేకప్ లేకుండానే కనిపిస్తున్నారు. అయితే ఇదే కారణంగా ఓ టాప్ యాంకర్ బిగ్ బాస్ ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఓ టాప్ యాంకర్ ను హౌన్ లో కంటెస్టంట్ గా తీసుకురావాలని నిర్వాహకులు బాగానే ప్రయత్నించారట. దీనికోసం ఆమెకు రోజుకి లక్ష చొప్పున పారితోషికం ఇస్తామని చెప్పినా.. ఆమె మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం బిగ్ బాస్ హౌస్ లో మేకప్ ఫెసిలిటీ ఉండదని సమాచారం. ఆ ఒక్క కారణంతో ఆఫర్ ను తిరస్కరించిందట.

గ్లామర్ పరంగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మేకప్ లేకుండా కనిపిస్తే ఆమె ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు కనిపిస్తాయనే భావనతో అంగీకరించలేదట. ఈ షో కోసం చూసుకొని ఆమె కెరీర్ ను రిస్క్ పెట్టలేనని నిర్వాహకులకు చెప్పేసిందట. ఇక షో విషయానికొస్తే.. ఈ వారం లేదా వచ్చే వారంలో మంచు లక్ష్మీ ఒకరోజు ఈ హౌస్ లో స్టే చేసే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.