ఈ మధ్య ప్రభాస్ ఫ్యాన్స్ కి  సడన్ సర్ప్రైజ్ లు ఎక్కువై పోయాయి. రాధే శ్యామ్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్, అలాగే ప్రభాస్ 21లో హీరోయిన్ గా దీపికా పదుకొనె ప్రకటన ఇవ్వన్నీ రోజు వ్యవధిలో ప్రభాస్ సడన్ గా ప్రకటించడం జరిగింది. ఈ రెండింటికి మించిన భారీ అనౌన్స్మెంట్ రేపు ప్రభాస్ నుండి రానుంది. ప్రభాస్ రేపు తన డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇంస్టాగ్రామ్ లో స్వయంగా తెలియజేశారు. దర్శకుడు ఓం రౌత్ తో కూడిన ఓ వీడియో పంచుకోవడం ద్వారా తెలియజేశారు. రేపు ఉదయం 7:11  నిమిషాలకు ఈ అనౌన్స్మెంట్ రానుంది.

 దర్శకుడు ఓం రౌత్ తో ప్రభాస్ బాలీవుడ్ మూవీ చేస్తున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నేటి ప్రకటనతో దీనిపై పూర్తి స్పష్టత రావడం జరిగింది. ఇక ఈ చిత్ర నిర్మాతగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఉన్నారు. రాధే శ్యామ్ హిందీ వర్షన్ ని ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇది ప్రభాస్ మరియు హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ అనే  ప్రచారం కూడా జరిగింది. మరి అదే నిజమైతే అతిపెద్ద కాంబినేషన్ గా  ఇది మారనుంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలపై స్పష్టత రాగా, రేపు ప్రకటనతో నటీనటుల గురించి తెలిసే అవకాశం ఉంది.

 ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది అనేది ఆసక్తికరం. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా , నెక్స్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీలో ప్రభాస్ నటించాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 లో ప్రభాస్ 21 మూవీ విడుదల కానుంది. కాబట్టి ఓం రౌత్ మూవీ 2022లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. దర్శకుడు ఓం రౌత్ ఈ ఏడాది తన్హాజీ చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు.