Asianet News TeluguAsianet News Telugu

హీరో నితిన్ కు గాయాలు, షూటింగ్ లో ప్రమాదం..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు షూటింగ్ లో గాయాలు అయినట్టు తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే.. 

Tollywood Young Hero Nithin Injured In Thammudu Movie Shooting JMS
Author
First Published Jan 11, 2024, 8:04 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు గాయాలు అయ్యాయి. షూటింగ్ లో ఉండగాన ఆయన చేతికి పెద్ద గాయం అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం తమ్ముడు టైటిల్ తో సినిమా చేస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేంగంగా సాగుతోంది. 

మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో నితిన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈషూటింగ్ లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు టీమ్. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యి.. కొన్నిపైట్ సీన్లు తీయగా.. ఈలోపు నితిన్ చేతికి పెద్ద గాయం అయినట్టు తెలుస్తోంది. దాంతో షూటింగ్ ను నిలిపివేశారట. అంతే కాదు నితిన్ మూడువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని డాక్టర్లు సూచించారట. దాంతో ఈమూవీ షూటింగ్ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. 

ఇక నితిన్ సాలిడి హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు. చాలా కాలంగా సరైన సినిమా పడక ఇబ్బందిపడున్నాడు యంగ్ హీరో. శ్రీనివాస కళ్యాణం సినిమా తరువాత చాలా కాలానికి దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేస్తున్న సినిమా ఇది. తమ్ముడు సినిమాపై టాలీవుడ్ యంగ్ హీరో  ఎన్నోఆశలు పెట్టుకున్నాడు. అటు డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఈసినిమాపై హోస్ తో ఉన్నాడు. పవన్ తో వకీల్ సాబ్ చేసిన వేణు.. చాలా గ్యాప్ తీసుకున్నాడు. బన్నీతో ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. చాలా కాలం సినిమా కోసం ఎదరు చూశాడు. ఇక ప్రస్తుతం నితిన్ తో హిట్టు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. 

నితిన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఆ విషయం తెలిసిందే. ఈసినిమా టైటిల్ కూడా ఆ సెంటిమెంట్ తో పెట్టిందే. ఈసారి తన గురుజీ  మార్క్ తో సినిమా చేస్తున్నాడునితిన్. మరితాను అనుకున్న ఫార్ములా ఈసారి అయినా వర్కైట్ అవుతుందా లేదా అనేది చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios