అక్కినేని నటవారసుడు అఖిల్.. బాలీవుడ్ ఎంట్రీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తోన్న అఖిల్.. బాలీవుడ్ లో లక్కును టెస్ట్ చేసుకోబోతున్నాడట. అందుకోసం బడా ప్రోడ్యూసర్ అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అఖిల్ అక్కినేని.. టాలీవుడ్ యంగ్ హీరో..అక్కినేని నటవారసుడు. కింగ్ నాగార్జున రొమాంటిక్ ఇమేజ్ ను.. కంటీన్యూ చేస్తున్నాడు అఖిల్. కాని ఇప్పటి వరకూ టాలీవుడ్ లో సాలిడ్ హిట్ పడలేదు ఈ యంగ్ హీరోకి. ఇప్పటికి నాలుగు సినిమాలకు పైనే చేసిన అఖిల్... రీసెంట్ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో పర్వాలేదు అనిపించాడు. సినిమా హిట్ అయ్యింది.. కాని అందరూ అనుకునే రేంజ్ మాత్రం అందుకోలేక పోయాడు. దాంతో ప్రస్తుతం తాడోపేడో తేల్చుకోవడం కోసం ఏజంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు అఖిల్.
అంతే కాదు ఈ సినిమా కోసం ఫుల్ గా మేకోవర్ అయ్యాడు అఖిల్. సిక్స్ ప్యాక్ తో బాడీని అద్భుతంగా తీర్చి దిద్దుకున్నాడు. అమ్మాయిల మనసుదోచుకుంటున్నాడు అఖిల్. అచ్చం బాలీవుడ్ హీరో మాదిరి రఫ్ అండ్ రగ్డ్ లుక్ లోకి మారిపోయాడు అఖిల్. అయితే ఇందంతా ఏజంట్ సినిమాతో పాటు బాలీవుడ్ ఎంట్రీకి కూడా పక్కా ప్రణాళిక అంటున్నారు సినీ జనాలు. త్వరలో అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో పరిస్థితి ఇలానే ఉంటే.. కనీసం బాలీవుడ్ లో క్లిక్ అయినా.. కెరీర్ కు తిరుగుండదు అని ఆలోచిస్తున్నాడ నాగార్జున. అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే అఖిల్ ను బాలీవుడ్ లో లాంచ్ చేసేది ఎవరు..?
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ త్వరలో అఖిల్‌ని హిందీలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, దాని కోసం ప్లాన్స్ జరుగుతున్నాయని హిందీ మీడియాలో రూమర్ గట్టిగా తిరుగుతుంది. జాన్వీ కపూర్ లాంటి యంగ్ స్టార్స్ ను ఆయనే తేరంగేట్రం చేయించాడు. ఇక అఖిల్ ను కూడా బాలీవుడ్ గుమ్మం తొక్కించడానికి కరణ్ సన్నాహాలు చేస్తున్నాడటని టాక్. అఖిల్ తన కొత్త సినిమా ఏజెంట్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తారా..? లేక అఖిల్ కోసం పవర్ ఫుల్ స్టోరీని బయటకు తీస్తాడా.. లేక రొమాంటిక్ మూవీని ప్లాన్ చేస్తాడా..? కరణ్ జోహార ఏం చేస్తాడు అనేది ఉత్కంటగా ఉంది. కాని కరణ్ ప్లానింగ్ మాత్రం పక్కాగా ఉంటుంది.
ఇప్పటికే కరణ్ జోహార్ టాలీవుడ్ కు బాలీవుడ్ కు ఓ బ్రిడ్జ్ లా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడి సినిమాలు అక్కడ.. అక్కడి సినిమాలు ఇక్కడ ప్రమోట్ చేస్తూ.. రెండు ఇండస్ట్రీల మధ్య మైత్రీ బంధం బలపడేలా అడుగులు వేస్తున్నాడు. బాహుబలి, ట్రిపుల్ ఆర్, ఏజెంట్ లాంటి సినిమాలను బాలీవుడ్ లో నడిపించిన స్టార్ ప్రొడ్యూసర్ మన టలీవుడ్ లో మంచి మంచి స్టార్ల ను ఎంచుకుని బాలీవుడ్ లో పైకి దండయాత్ర చేపించబోతున్నాడట టాక్ ఉంది. అందులో భాగంగానే అఖిల్ తో సినిమా చేయబోతున్నాడట కరణ్ జోహార్. ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎటువంటీ అధికారిక ప్రకటన రాలేదు. కాని మొన్న ముంబై లోని కరణ్ జోహార్ ఆఫీసులో నాగార్జున కనిపించారు. ఇప్పుడు తన కొడుకు అఖిల్ హిందీ అరంగేట్రం విషయంలో నాగ్ ముంబైలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సినీ జనాలు.
