Adivi Sesh: శర్వానంద్, వరుణ్ తేజ్ అయిపోయారు.. ఇక పెళ్లికి రెడీ అవుతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..
టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది యంగ్ స్టార్ తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లికి సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది.
ఈమధ్య వరుసగా యంగ్ హీరోలు పెళ్లిపీఠలు ఎక్కుతున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నప్రభాస్ తప్పించి.. ఆల్ మెస్ట్ టాలీవుడ్ యంగ్ స్టార్స్ అంతా ఓ ఇంటివారు అయ్యారు. ఈక్రమంలో మిగిలి ఉన్న కొంత మంది కూడా ఒకరి తరువాత ఒకరు ఓ ఇంటివారు అవుతున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ స్టార్ అడివి శేష్ కూడా త్వరలో పెళ్ళి పీఠలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. కొంతకాలంగా సుప్రియ యార్లగడ్డతో అడవి శేషు ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అని న్యూస్ వైరల్ అవుతూ వస్తోంది.
అయితే దీనిపై ఇద్దరిలో ఎవరూ ఏమాత్రం స్పందించిన దఖలాలు లేవు. అయితే చాలా కాలంగా వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని టాక్. సుప్రియ అడవిశేష్ లైఫ్ లో తమ నిర్ణయం తాము తీసేసుకున్నట్లు తెలుస్తుంది . గతంలో అక్కినేని ఇంట జరిగిన పలు ఫంక్షన్స్ లో ప్రైవేట్ పార్టీలో అడవిశేష్ ఫ్యామిలీ పిక్స్ లో కనిపించడమే ఈ రూమర్స్ కు పెద్ద కారణం. చాలా కాలంగా వీరిద్దరు ఒక ఇంటివారు అవ్వాలని చూస్తున్నా.. అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదరు చూశారట.
ఇక ప్రస్తుతం అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో సుప్రియ రెండో పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పిందని తెలుస్తుంది.అంతేకాదు అడవి శేష్ - సుప్రియ ల ఎంగేజ్ మెంట్ కు కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈనెల అంటే డిసెంబర్ 22 నిశ్చితార్ధం జరగబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. సోషల్ మీడియా మాత్రం ఈ విషయంలో కోడై కూస్తోంది. మరి ఈ విషయంలో అడివి శేష్ స్పందిస్తారా..? లేక ఇది రూమర్ గానే మిగిలిపోతుందా..? . అనేది చూడాలి.