ఒకే ఒక్క నైట్ లో జీవితం మారిపోతుంది అనే మాట వినడానికి చాలా సింపుల్ గా ఉన్న అనుభవిస్తే గాని దాని కిక్కు తెలియదు. జయాపజయాల నడుమ జీవితాల్ని ఒక్కసారిగా మార్చేసే టాలీవుడ్ లో అలాంటి యూ టర్న్ లు చాలానే కనిపిస్తాయి.   రీసెంట్ గా మజిలీ - జెర్సీ సినిమాలతో మంచి హిట్ అందుకున్న దర్శకులిద్దరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. 

మజిలీ సినిమాతో హిట్టు కొట్టిన శివ నిర్వాణ ఇంతకుముందు నిన్నుకోరి సినిమాతో సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక జెర్సీ సినిమాతో సరికొత్త విజన్ ని తెరపై చూపించిన గౌతమ్ తిన్ననూరి రెండేళ్ల కిందట మళ్ళీ రావా సినిమాతో సింపుల్ హిట్ అందుకున్నాడు. ఎంతో కష్టపడి హిట్టందుకున్న ఈ దర్శకులు ఓ విధంగా హీరోల కెరీర్ ను కూడా సెట్ చేశారు. 

నాగ చైతన్య - నాని .. ఈ ఇద్దరి హీరోల గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. సక్సెస్ లేని సమయంలో అనుభవం ఉన్న దర్శకులతో సినిమా చేయకుండా ఒకే ఒక్క హిట్ అందుకున్న శివ - గౌతమ్ లను నమ్మి సక్సెస్ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో మిగతా స్టార్ హీరోలు కూడా కుర్ర దర్శకులపై మనసు పారేసుకుంటున్నారు. 

ఇక నిర్మాతలు సైతం రెమ్యునరేషన్ తో వల వేస్తూ బంగారంలా మార్చేస్తున్నారు. ఒక అఫర్ వస్తే మిగతా ఆఫర్స్ లో పారితోషికం డోస్ పెరుగుతోంది. మొత్తానికి ఇప్పుడు కొత్త యువ దర్శకులు కూడా ఇండస్ట్రీలో స్టార్ దర్శకులకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు.