టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఈ గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు ఓ మినీ యుద్ధమే జరుగుతోంది. మన్మథుడు నుంచి ఎవరు సినిమా వరకు అన్ని సినిమాలు విడుదలకు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలైనవే. అయితే టోటల్ గత రెండు వారల కలెక్షన్స్ ని పరిశీలిస్తే ఎవరు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుందనే చెప్పాలి. 

మన్మథడు 2 మొదటి రోజు కలెక్షన్స్ ని బాగానే రాబట్టినప్పటికీ వీకెండ్స్ తరువాత డల్ అయ్యింది. 18కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆ సినిమా 10కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాక్షసుడు - కొబ్బరిమట్ట సినిమాలు వాటికి తగ్గ బిజినెస్ తో ప్రాఫిట్స్ లోకి రాగా గత వారం నుంచి ఎక్కువ థియేటర్స్ తో రణరంగం - ఎవరు సినిమాలు పోటీ పడ్డాయి. 

ఈ ఫైట్ లో అడివిశేష్ సప్సెన్స్ థ్రిల్లర్ మంచి వసూళ్లతో ప్రాఫిట్స్ కు దగ్గరగా ఉంది. 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎవరు ఇప్పటికే 7కోట్లకు పైగా షేర్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీక్ తరువాత కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ అందే అవకాశం ఉంది. ఇక శర్వా రణరంగం మాత్రం మొదటిరోజు హడావుడి చేసినప్పటికీ సెకండ్ డే నుంచి కలెక్షన్స్ లో డీలా పడింది. యావరేజ్ వీకెండ్ గా కొనసాగినట్లు తెలుస్తోంది.