కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు షూటింగ్‌కి రెడీ అవుతాయని అందరూ భావించారు. అందుకు దర్శక నిర్మాతలు ప్లాన్స్  వేసుకున్నారు. కానీ షూటింగ్ లు మాత్రం మొదలు కావటం లేదు. హీరోలు మాత్రం కరోనా నేపథ్యంలో ఇంకొంత కాలం షూటింగ్ వద్దని చెబుతున్నారు. ఎంతో ఉత్సాహంగా అనుకున్న రాజమౌళి మాత్రం ట్రయల్ షూట్‌ సైతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఏమిటి మన టాలీవుడ్ నెక్ట్స్ స్టెప్ అంటే...

షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని వెయిట్ చేస్తున్నారు సినీ కార్మికలు. అయితే ఫిల్మ్ మేకర్స్, హీరోలు బ్రేక్ వేస్తున్నారు. కరోనాకు భయపడి షూటింగ్‌ అంటేనే దూరం వెళ్లిపోతున్నారు. మరి వీరిలో సాహసం చేసి సెట్స్ పైకి వెళ్లేదెవరు..? షూటింగ్‌లకు దూరంగా ఉండేదెవరు..? అంటే పెద్ద స్టార్స్ ఎవరూ లేరని తెలుస్తోంది. కేవలం టీవీ సీరియల్స్, పోగ్రామ్ లు వాళ్లు మాత్రమే ధైర్యం చేస్తున్నారు. మరో ప్రక్క రవిబాబు కొత్త వాళ్లతో చేస్తున్న క్రష్ షూటింగ్ జరుగుతోంది. అంతకు మించి ముందుకు కదలలేదు.  ఈ నేపధ్యంలో తాము రిస్క్ తీసుకోలేమని హీరోలు చెప్పటంతో, ఆగస్టు దాకా షూట్ లు ఆపుకోవటమే మంచిదనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లు సమాచారం. అప్పటికి కరోనా ఉధృతి తగ్గితే షూట్ కు వెళ్ళటం..లేదా వెయిట్ చేయటం తప్ప వేరే దారి లేదంటున్నారు. 

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిత్రాలను ఒకసారి చూస్తే.. చిరు ‘ఆచార్య’, నాగార్జున ‘వైల్డ్ డాగ్’, వెంకీ ‘నారప్ప’, ప్రభాస్-రాధాకృష్ణ సినిమా, రవితేజ ‘క్రాక్’, పవన్ ‘వకీల్ సాబ్’, నాగచైతన్య ‘లవ్ స్టోరి’, నానీ ‘టక్ జగదీష్’, విజయ్ దేవరకొండ ‘ఫైటర్’, గోపీచంద్ ‘సీటీమార్’, కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్.. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకొని, తిరగి షూటింగ్ కు వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఎవరి సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుంది..? ఏ హీరో ముందుగా ఆ సాహసం చేస్తాడు..? అనే చర్చ కు బ్రేక్ పడినట్లే.