టాలీవుడ్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకునే అరుదైన సీన్‌ ఫ్రేమ్‌లోకి వచ్చింది. అది ఒకే ఫోటోగా మారింది. అందరి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు 50వ పుట్టిన రోజు సందర్బంగా ఇచ్చిన పార్టీలో టాప్‌ స్టార్స్ అంతా కలిసి ఫోటోకి పోజిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

నిర్మాత దిల్‌రాజు శుక్రవారంతో యాభైవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడంతో ఆయన భారీగా పార్టీ ఇచ్చాడు టాలీవుడ్‌ సెలబ్రిటీలకు. ఇందులో దాదాపు అందరు స్టార్స్ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రవితేజ, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి కొద్ది మంది తప్ప చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్, మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, విజయ్‌ దేవరకొండ, నితిన్‌, నాగచైతన్య, రామ్‌, అఖిల్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే, అనుపమా పరమేశ్వరన్‌, యష్‌, వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా, విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్‌ వంటి స్టార్స్ పాల్గొన్నారు. 

అయితే ఇందులో టాప్‌ స్టార్స్ అయిన ప్రభాస్‌, మహేష్‌, రామ్‌చరణ్‌, రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య ఒకే ఫ్రేములో నిలవడం హైలైట్‌గా నిలిచింది. వీరందరు కలిసి ఫోటోకి పోజివ్వగా, ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. స్టార్స్ తోపాటు, వారి అభిమానులు వరుసగా ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఇది తెగ వైరల్‌ అవుతుంది.