75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య, ఎన్టీఆర్, రామ్ చరణ్, మంచు విష్ణు త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. 

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా టాలీవుడ్ లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆయన స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనం చేశారు. అనంతరం స్టాఫ్ తో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తన ప్రసంగంతో దేశభక్తిని చాటుకున్నారు. భారతీయులందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి పైనా జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ వందనం అనంతరం భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. 

View post on Instagram
Scroll to load tweet…

నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలయ్య (Balakrishna) బసవతారకం ఆస్పత్రిలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. జెండాకు గౌరవ వందనం చేశారు. డాక్టర్లు, స్టాఫ్, తదితరులతో కలిసి జాతీయ గీతాన్ని పాడారు. అనంతర దేశానికి స్వాతంత్య్ర తెచ్చిపెట్టిన మహనీయుల గురించి గొప్పగా మాట్లాడారు. ప్రతి ఒక్క భారతీయుడికి, తెలుగు ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు, భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా తెలుగు ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘మన దేశ హీరోలందరినీ స్మరించుకోవడానికి ఒక్క నిమిషం వెచ్చిద్దాం. మన భవిష్యత్తును మరింత సుసంపన్నంగా మార్చుకోవడానికి మన జీవితమంతా కృషి చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తోటి భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వాతంత్ర్య ఫలాలను అనుభవించడానికి మన కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులందరికీ కృతజ్ఞతలు తెలుపుదాం. హర్ ఘర్ తిరంగా చొరవ చాలా దూరం వ్యాపించడం పట్ల గర్వంగా ఉంది.’ అని తెలిపారు. అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా తన దేశభక్తిని చాటుకున్నారు. ‘ఫ్రీడమ నుంచి వచ్చే ఆనందం ఎనలేనిది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం మనకు స్వేచ్ఛను తెచ్చిందని.. సక్రమంగా ఉపయోగించుకుందాం, మన విధులను సరిగా నిర్వహించుకుందాం’. అంటూ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

‘మా’ అధ్యకుడు, నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) సినీ లోకానికి తమ అసోసియేషన్ ద్వారా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మన స్వాతంత్య్రానికి బాటలు వేసిన సమరయోధులు మరియు నాయకుల పోరాటాలకు ‘మా’ నిజాయతీగా నివాళులు అర్పిస్తోందన్నారు. భారతదేశ వైభవం, మన రాజ్యాంగ వారసత్వం మరియు మన దేశ ఐక్యత ఎల్లప్పుడూ ఉన్నతంగా ఎగరాలని ఆకాంక్షించారు. మంచు లక్ష్మి (Manchu Lakshmi) జాతీయ జెండాను చేతపట్టి దేశ భక్తిని చాటుకుంది. భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపింది.

Scroll to load tweet…

రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) కూడా తన దేశభక్తిని చాటుకున్నారు. ముంబైలోని తన నివాసం వద్ద 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. ‘దేశంలోని ప్రతి ఇంట మనమే.. ప్రతి ఇంటిపై మన జెండా’ అంటూ వ్యాఖ్యానించారు. వేలాది మందికి నిస్వార్థంగా సేవలందిచిన సోనుకూ పలువురు అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to load tweet…

టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) కూడా దేశ ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. మనకు ఫ్రీడమ్ అందించిన స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ భవిష్యత్ లో ఉన్నత స్థాయికి భారత్ చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ‘కేజీఎఫ్’ స్టార్ యష్ కూడా కుటుంబ సమేతంగా జెండాకు వందనం చేశారు. తన పిల్లలతో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Scroll to load tweet…

Scroll to load tweet…