సినిమాల్లో హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేయడం సహజమే. టాలీవుడ్ లో కూడా అందాల మోత ఎక్కువగానే ఉంటుంది. కానీ బాలీవుడ్ లో గ్లామర్ డోస్ మరీ ఎక్కువ అనే చెప్పాలి. ఫ్యాషన్ సిటీ కావడంతో ముంబై చెక్కేసిన భామలు కాసింత ఎక్కువగానే ఎక్స్ పోజింగ్ చేస్తుంటారు. 

ఆ మాటకు వస్తే.. దాదాపు సినిమా రంగంలో అడుగుపెట్టిన హీరోయిన్స్ అందరి టార్గెట్ బాలీవుడ్డే. కానీ ఆ విషయం కొందరు పైకి చెబుతారు.. మరికొందరు చెప్పరు. కానీ ఇక్కడి సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేసి ఆఫర్లు పట్టి.. తర్వాత బాలీవుడ్ అవకాశాలు అందుకున్నాక.. మనోళ్లను తిట్టిన వాళ్లూ ఉన్నారు. ఇక్కడ మడి కట్టుకు కూచున్నామని చెప్పి.. హిందీలో మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేయడం కామన్. ఇక ప్రముఖ మేగజైన్స్ కు ఫోటో షూట్స్ చేయడం కోసం అయితే.. ఈ ట్రెండ్ మరీ ఎక్కువ. 

నాకు మిలిటరీ బ్యాక్ గ్రౌండ్.. బాగా స్ట్రిక్ట్ లాంటి కబుర్లు చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ చూస్తే మతులు పోవాల్సిందే. ఆ స్థాయిలో గ్లామర్ ఒలకబోసేసింది. తెలుగులో ఎక్స్ పోజింగ్ కు అంతగా సహకరించని కాజల్ అగర్వాల్ కూడా ముంబైలో విపరీతంగా గ్లామర్ కురిపించేస్తూ ఉంటుంది. ఇలియానా కూడా తక్కువేమీ కాదు. అక్కడకు చేరుకున్నాక అసలు హద్దుపద్దూ లేకుండా చెలరేగిపోతోంది. 

ఇక తాప్సీ పన్ను గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. సౌత్ లో తనను ఎక్స్ పోజింగ్ కోసం వాడుకున్నారని చెప్పి తెగ కబుర్లు చెప్పి.. చివరకు జుడ్వా2లో ఏం చూపించిందో ఆమెకే తెలియాలి. మొత్తానికి బాలీవుడ్ చేరుకున్నాక అందాల భామలు మరీ బరి తెగించేయడానికి రెడీ అయిపోతుండడం ఆశ్చర్యకరమే.