Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో విషాదం, ప్రముఖ నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూత,..

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుంది. ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్న క్రమంలో.. తాజాగా తెలుగు నిర్మాత గోగినేని ప్రసాద్ మరణించారు. 

Tollywood Senior Producer Gogineni Prasad Passed away JMS
Author
First Published Sep 14, 2023, 12:46 PM IST

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుంది. ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్న క్రమంలో.. తాజాగా తెలుగు నిర్మాత గోగినేని ప్రసాద్ మరణించారు. 

వరుస మరణాలతో ఫిల్మ్ ఇండస్ట్రీ కుదేలు అవుతోంది. అన్ని భాషల్లో ఎవరో ఒక స్టార్  ఈ మధ్య మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్  సీనియర్ స్టార్లు  సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు,  విశ్వనాథ్, శరత్ బాబు లాంటి పెద్దవారు తిరిగిరాని లోకాలకువెళ్లిపోయారు. ఇక తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు నిర్మాత గోగినేని ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. 

ప్రసాద్ మరణం గురించి ఆయన  కుటుంబ సభ్యులు వెల్లడించారు.  73 సంవత్సరాల  వయస్సులో... ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా ప్రసాద్ అనారోగ్యంతో  బాధపడుతున్నారు. ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. 

గోగినేని ప్రసాద్  టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించారు. పల్నాటి పులి, శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్యం, ఈ చరిత్ర ఏ సిరాతో' లాంటి విజయవంతమైన  సినిమాలను ఆయన నిర్మించారు. కాగా  గోగినేని ప్రసాద్ కు ఒక కూమారుడు ఉండగా.. ఆయన ప్రస్తుతం  అమెరికాలో స్థిరపడినట్టు తెలుస్తోంది. ఆయన వచ్చినతరువాత మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios