ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.రంగారావు మరణంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. 1957 మే 5న జన్మించిన ఆయన ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. 

కో డైరెక్టర్ గా, కొన్ని చిత్రాలకు డైరెక్టర్ పని చేసిన ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ లో మరణించారు. 'ఇంద్రధనుస్సు' చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన 'నమస్తే అన్న', 'బొబ్బిలి బుల్లోడు', 'ఉద్యమం', 'అలెగ్జాండర్' లాంటి చిత్రాలతో దర్శకుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు.

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన చివరిగా బోయపాటి డైరెక్ట్ చేసిన 'జయ జానకి నాయక' సినిమాకి దర్శకత్వశాఖలో పని చేశారు. దర్శకుల సంఘంలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ఈరోజు సాయంత్రం సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.