Asianet News TeluguAsianet News Telugu

సిక్కిం వరదల్లో తెలుగు సీనియర్‌ నటి గల్లంతు.. ఎన్టీఆర్ తో కలిసి నటించిన సరళ కుమారి..

హఠాత్తుగా ముంచెత్తిన  వరదల కారణంగా సిక్కిం రాష్ట్రం అల్ల కల్లోలంగా మారింది. ఈ వరదల్లో అనూహ్యాంగా మన తెలుగు సీనియర్ నటి గల్లంతయినట్టు తెలుస్తోంది. ఇంతకీ వివరాలేంటంటే...? 

Tollywood Senior Actress sarala kumari missing in sikkim flash flood JMS
Author
First Published Oct 7, 2023, 5:04 PM IST

హఠాత్తుగా ముంచెత్తిన  వరదల కారణంగా సిక్కిం రాష్ట్రం అల్ల కల్లోలంగా మారింది. ఈ వరదల్లో  అనూహ్యాంగా  మన తెలుగు సీనియర్ నటి  గల్లంతయినట్టు తెలుస్తోంది. ఇంతకీ వివరాలేంటంటే...?   
సిక్కీం రాష్ట్రంలో వరదల కారణంగా ఎంతో మంది గల్లంతయ్యారు. సైనికులు ఎక్కువగా ఈ వరదల్లో మరణించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మన తెలుగు వారు కూడా అందులో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో టాలీవుడ్ సీనియర్ నటి సరళ కుమారి కూడా అందులో ఉన్నట్టు చెపుతున్నారు. ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి సిక్కిం వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత ధ్రువీకరించారు. 

అంతే కాదు అమ్మ ఆచూకీని గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తన తల్లి ఆచూకీ కోసం చొరవ చూపించాలంటూ ఆమె కోరారు.  హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న సరళ కుమారి అక్టోబర్ 2న స్నేహితులతో కలసి సిక్కిం పర్యటనకు వెళ్లినట్టు ఆమె కుమార్తె చెప్పారు. అక్కడ ఓ హోటల్ లో ఆమె బస చేసినట్టు వెల్లడించారు. అయితే సిక్కీం వెల్లితన తన తల్లి 3 తారీకు వరకూ తనతో కాంటాక్ట్ లోనే ఉందని. కాని ఆరోజు తరువాత సమాచారం కట్ అయ్యిందన్నారు. 

చివరిగా ఈ నెల 3న అమ్మతో ఫోన్ లో మాట్లాడానని, ఆ తర్వాత అమ్మతో సమాచారం లేదంటూ నబిత వెల్లడించారు. వరదలు వచ్చినట్టు వార్తలు చూసి తెలుసుకున్నాను. ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసినప్పటికీ కలవడం లేదు’’ అని నబిత ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు. ఇక సరళ కుమారి చేసింది తక్కవు సినిమాలే అయినా.. మంచి గుర్తింపు ఉన్న సినిమాలు చేసింది. మరీ ముఖ్యంగా  ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ 'దాన వీర శూర కర్ణ'లో నటించారు. సంఘర్షణ తదితర సినిమాల్లోనూ నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios