Asianet News TeluguAsianet News Telugu

అయోధ్యకు వెళ్లడ లేదు.. కారణం ఇదే.. మెహన్ బాబు కామెంట్స్..

రామ మందిరం ప్రారంభోత్సవంపై స్పందించారు ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు. అయోధ్య ప్రాణ పత్రిష్ట కార్యక్రమానికి వెళ్ళడం లేదు అన్నారు. కారణం టేంటంటే..? 

Tollywood Senior Actor Manchu Mohan babu Comments about Ayodhya Ram Mandir JMS
Author
First Published Jan 21, 2024, 9:44 AM IST

జై శ్రీరామ్ అంటూ.. కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టా మహోత్సవం రేపు (22 జనవరి) లో జరగబోతోంది. ఈకార్యకక్రమం కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. అందరూ తరళి వెళ్తున్నారు. కొన్ని వేల మంది సెలబ్రిటీలు అద్భుతంలో పాలు పంచకోబోతున్నారు. లక్షల్లో భక్తులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు మన సినీరంగం తో పాటు.. అన్ని రంగాల నుంచి  కార్యక్రమానికి దాదాపుగా  దాదాపు 8 వేల మంది ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ఆహ్వానాలు అందాయి. 

ఇందులో పలువురు టాలీవుడ్ ప్రముఖులను కూడా ట్రస్టు ఆహ్వానించింది. ఈక్రమంలో ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు కూడా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. అయోధ్య వేడుకకు తనకు కూడా ఆహ్వానం అందిందని మోహన్ బాబు చెప్పారు. కాని తాను ఆ కార్యక్రమానికి వెళ్లలేక పోతున్నట్టు వెల్లడించారు.భద్రతా కారణాల వల్ల మాత్రమే రాలేకపోతున్నానని, తనను క్షమించమని లేఖ రాశానని తెలిపారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. 

మోహన్ బాబు మాట్లాడుతూ.. అయోధ్యలో కార్యక్రమం జరగేసమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తాను.. ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానం పాలక మండలి ఛైర్మన్ గా నేను బాధ్యతలను స్వీకరించాను. ఈ దేవాలయంలో వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, షిర్డీ సాయిబాబా, లక్ష్మీనరసింహ స్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతలు  కొలువై ఉన్నారు. రామ మందిర ప్రారంభోత్సవం నాడు ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి తరిస్తాము అని మోహన్ బబు అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios