Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో తీవ్ర విషాదం, సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అలనాటి సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ  కన్ను మూశారు. చాలా కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 

Tollywood senior actor kaikala satyanarayana passed away
Author
First Published Dec 23, 2022, 8:05 AM IST

వరుస మరణలు తెలుగు సినీపరిశ్రమలో విషాదాన్నినింపుతున్నాయి. ఈ మధ్యే సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. తాజాగా  సీనియర్ నటులు..  కైకాల సత్యనారాణయ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపుతున్న సత్యనారాయణ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో..  ఆయనకు ఇంటిదగ్గరే చికిత్స అందించారు వైద్యులు. కొద్దిసేపటి క్రితమే ఆయన కన్ను మూశారు. దాదాపు 770కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కైకాల సత్యనారాయణ . విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రికార్డ్ సృష్టించారు.. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస  విడిచారు. కైకాల. మహానటుడి మృతిపట్ల పలువురు సినీ రాజకీయ  ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ కు  ఆయన భౌతికకాయం తరలించే అవకాశం కనిపిస్తుంది.  శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. 

60 ఏళ్ల సినీ జీవితంలో హీరోగా స్టార్ట్ చేసి..  విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడియన్ గా.. రకరకాల  పాత్రల్లో దాదాపు 770కి పైగా సినిమాల్లో అలరించారు సత్యనారాయణ నటించారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కైకాల..  2009లో అరుంధతి సినిమా తరువాత నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. మహర్షి  సినిమాలో  చివరిసారిగా కనిపించారు కైకాల. 

కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు గ్రామంలో 1935లో జన్మించిన సత్యనారాయణకు భార్య  ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న కైకాల..మూడు తరాల నటులతో కలిసి నటించారు. కైకాల కెరీర్ లో ఎక్కువగా ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో 100 సినిమాలకు పైగా నటించి రికార్డ్ సృష్టించారు కైకాల. ఏడాది క్రితం కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యంపాలు అయిన కైకాల.. చాలా రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆతరువాత కూడా ఇంట్లో మంచానికే పరిమితం అయిన కైకాలను మెగాస్టార్ చిరంజీవి తరుచూ పరామర్శిస్తూ ఉండేవారు. అంతే కాదు ఆమధ్య కైకాల పుట్టిన రోజున చిరు కైకాల ఇంటికి వెళ్లి.. కేక్ కట్ చేయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios