టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత తేనెటీగ రామారావు (68) మరణించారు.
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత తేనెటీగ రామారావు (68) మరణించారు. 90 వ దశకంలో తేనెటీగ రామారావు అనేక చిత్రాలు నిర్మించారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. తేనెటీగ చిత్రంతో వచ్చిన గుర్తింపుతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.
తేనెటీగ రామారావు గత కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండగా పరిస్థితి విషమించింది. దీనితో ఆయన నేడు ఆదివారం రోజు తుది శ్వాస విడిచారు. దీనితో తేనెటీగ రామారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
తేనెటీగ రామారావు అసలు పేరు జవాజి వెంకట రామారావు. ఆయన తేనెటీగ, ప్రేమ అండ్ కో, బొబ్బిలి వేట, బడి లాంటి చిత్రాలని ఆయన నిర్మించారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలని కూడా ఆయన తెలుగులో రిలీజ్ చేశారు. ఆయన నిర్మించిన ప్రేమ అండ్ కో చిత్రంలో నరేష్, వాణి వాణి విశ్వనాథ్ జంటగా నటించారు.
