అనైతిక కార్యక్రమాల కోసం విదేశీ మహిళలను అక్రమంగా రవాణా చేసినట్టు తేల్చింది. వీసా పర్మిట్లను దురిన్వియోగం చేశారన్న ఫెడరల్ ఏజెన్సీ ఆరోపణలతో నార్త్ ఎలినాయ్ కోర్టు ఏకీభవించింది.


డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్‌ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. షికాగో సెక్స్ రాకెట్‌లో అమెరికా న్యాయస్థానం నిందితులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. 2018 నాటి ఈ కేసు ఇప్పుడు హియిరింగ్ కు వచ్చింది. ఈ కేసు జూన్ 24 న తీర్పు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు 34 సంవత్సరాలు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.  కేసు వివరాల్లోకి వెలితే...

 షికాగో సెక్స్ రాకెట్‌లో అమెరికా న్యాయస్థానం నిందితులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను దోషులుగా తేల్చింది. వీళ్లిద్దరు తమను తాము తెలుగు సినిమా నిర్మాతలుగా పరిచయం చేసుకున్నారు. వీళ్లు కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్స్ గా చేసారు. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికా రప్పించి.. అక్కడ వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు నిజమేనని అమెరికా న్యాయస్థానం తేల్చింది. అనైతిక కార్యక్రమాల కోసం విదేశీ మహిళలను అక్రమంగా రవాణా చేసినట్టు తేల్చింది. వీసా పర్మిట్లను దురిన్వియోగం చేశారన్న ఫెడరల్ ఏజెన్సీ ఆరోపణలతో నార్త్ ఎలినాయ్ కోర్టు ఏకీభవించింది.

పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీతారలతో వ్యభిచారం ఎలా చేయించేవారో నటీమణులు విచారణలో తెలిపారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలను అమెరికాకు రప్పిస్తారు. డబ్బులు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతారు. తర్వాత తమ గురించి బయటపెడితే చంపుతామని బెదిరిస్తారని వివరించారు.

2017 నవంబర్‌ 20న ఓ హీరోయిన్‌ ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగోకి వెళ్లింది. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా నవంబర్‌18న ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు షికాగోకు వెళ్లింది. దీంతో అనుమానం వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్‌లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది.

 కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్‌లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్‌ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు.

కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది తేలాల్సి వుంది. ఈ కేసులో అరెస్టయిన వారిని వచ్చే గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. నెల రోజుల్లోపే ఈ కేసు కొలిక్కి వస్తుందని, శిక్ష పడితే అది పూర్తయిన తర్వాత ఇద్దర్నీ దేశం నుంచి పంపేస్తారని ఓ అధికారి తెలిపారు.

మొదట్లో తెలుగు సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా పని చేసిన కిషన్.. తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. తనకున్న పరిచయాలతో నటీమణులను ఈ దారుణ రాకెట్లోకి లాగాడు. కొన్ని ఏళ్లపాటు తన భార్యతో కలిసి ఈ రాకెట్ నడిపాడు. అమెరికాలోని తెలుగు సంఘాలకు ఈవెంట్ల కోసం సెలబ్రిటీలను సప్లయ్ చేసే కోఆర్డినేటర్‌ ముసుగులో నటీమణులను వ్యభిచార ఊబిలోకి దింపటం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. కిషన్ మోదుగుమూడి విటులతో మాట్లాడుతున్న ఆడియో టేపులు ఆ మధ్య బయటకు వచ్చాయి. అవి షాక్ కు గురి చేసాయి.

శ్రీరాజు చెన్నుపాటి, విభ జయం పేరిట కిషన్ ఆయన భార్య ఈ  దందాను నడిపారు. కిషన్ దంపతుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నటీమణులు అమెరికా చేరుకోగానే వారి పాస్‌పోర్టులను లాగేసుకునే వారని, బలవంతంగా వారితో వ్యభిచారం చేయించేవారని తెలిసింది. ఒప్పుకోకపోతే రిటర్న్ టికెట్లు బుక్ చేయమని, పాస్‌పోర్టులు ఇవ్వమని బెదిరించే వారనే వార్తలు వెలువడ్డాయి. అవన్నీ నిజమని తేలటంతో ఇప్పుడు వారికి శిక్ష పడుతుందని సమాచారం.