Asianet News TeluguAsianet News Telugu

విశ్వక్ సేన్ చీఫ్ గెస్ట్.. హీరోగా ‘బిగ్ బాస్’ గౌతమ్.. తనీష్ బర్త్ డే స్పెషల్, ‘ద్రోహి’ ఫస్ట్ లుక్.. అప్డేట్స్

నిన్న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిథియేటర్లలో సందడి చేస్తుండగా.. ఈరోజు టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న ఆయా చిత్రాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్  అందాయి. 
 

Tollywood  movies Latest Updates NSK
Author
First Published Sep 8, 2023, 9:14 PM IST

టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్’. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 15న విడుదల కానుంది. దీంతో 11న (సోమవారం) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఫంక్షన్ కు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen)  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Tollywood  movies Latest Updates NSK

Bigg Boss Telugu సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ (Gautham Krishna)  హీరోగా శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి కథానాయికలుగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సెవెన్‌హిల్స్‌ ప్రొడక్షన్స్‌  పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 3గా రానున్న ఈ చిత్రానికి పి.నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న మూడో చిత్రమిది. త్వరలో ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఒక స్టూడెంట్‌ నుంచి కార్పొరేట్‌ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథ ఇది అన్నారు. 

Tollywood  movies Latest Updates NSK

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి.. హీరోగా ‘నచ్చావులే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ టాలెంట్ తనిష్ (Tanish) పుట్టిన రోజు నిన్న కావడం విశేషం. ఆయన కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్యలో బిగ్ బాస్ సీజన్ 2 లో టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకి మరింతగా దగ్గరయ్యారు. బర్త్ డే స్పెషల్ గా కిశోర్ వర్మ దర్శకత్వం లో ఇప్పుడు చేస్తున్న ‘క్రిమినల్’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. పోస్టర్ లో తనీష్ కొత్తగా కనిపించాడు. రెండు వేరియేషన్స్ తో తనీష్ లుక్ డిఫ్రెంట్ గా అనిపిస్తోంది. క్రియేటివ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 

Tollywood  movies Latest Updates NSK

క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ‘ద్రోహి : ది క్రిమినల్‌’ చిత్రం ఫస్ట్ లుక్ ను ఈరోజు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్నది ఉపశీర్షికజ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి  విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు. ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Tollywood  movies Latest Updates NSK

Follow Us:
Download App:
  • android
  • ios