మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పిస్తున్న సినిమా ‘సాగు’తో పాటు ఆయా మూవీస్ అప్డేట్ అందాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాల నుంచి ఈ రోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందాయి.
నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పిస్తున్న చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా సాగు అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించారు. ‘సాగు’ (Saagu) సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. ప్రేమ, వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని ఎదురిస్తుంది, ఓడిస్తుంది. సాగు హరిబాబు మరియు సుబ్బలక్ష్మిల కథ .వాళ్లకున్న అడ్డులు తొలగించుకుని, వాళ్ళ ఆశలు, ఆశయాలు కోసం పోరాడి వాళ్లకున్న బీడు భూమికి నీళ్లు తెచ్చుకుంటారు. ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలులైన ఎదురుకుంటుంది అన్నదానికి నిదర్శనమే ‘సాగు’. అనంతరం నిహారిక, వినయ్ రత్నం, వంశీ, హారిక బల్ల సినిమా గురించి ఇంట్రెస్టింగ్ గామాట్లాడారు.

'తంత్ర' సినిమా.. అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో నటించిన 'తంత్ర' క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. 'రామాయణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేస్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నికుంబళ దేవి ఒక క్షుద్రదేవత. ఇంద్రజిత్తు తలపెట్టింది క్షుద్రపూజ' అంటూ లక్ష్మణ్ మీసాల తాంత్రిక పూజల గురించే చెప్పే టెర్రిఫిక్ ఎపిసోడ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ఈవెంట్ లో భాగంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి, హీరోయిన్ అనన్య నాగళ్ల, హీరో ధనుష్ రఘుముద్రి, సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ సినిమా గురించి మాట్లాడారు.

క్రేజీ కాంబినేషన్...
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రేక్షకులకు మంచి మంచి చిత్రాలు అందించి తన అభిరుచి చాటుకున్నారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. అగ్ర కథానాయిక సమంత 'యశోద'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800'కి సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో తొలి సినిమా నాని 'జెంటిల్ మన్'. బాక్సాఫీస్ విజయంతో పాటు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ జంటగా సూపర్ హిట్ సినిమా 'సమ్మోహనం' చేశారు. ఇప్పుడు చేయబోయేది వాళ్ళిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా. ఇందులో ప్రియదర్శి కథానాయకుడిగా నటించనున్నారు. హీరోగా 'బలగం' సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

