‘ఇంద్ర’ నటి ప్రశాంతి హారతి కూతురు హవా.. పుస్తకావిష్కరణలో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు.. టుడే అప్డేట్స్..
మెగా స్టార్ చిరంజీవి పుస్తకావిష్కరణలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ‘ఇంద్ర’ నటి ప్రశాంతి హారతి కూతూరు యూట్యూబ్ లో సందడి చేస్తోంది. రాక్షస కావ్యం, లింగొచ్చా వంటి మూవీస్ నుంచి అందించిన అప్డేట్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి.
‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరు
భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన పుస్తకమే ’తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర‘. ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ‘నా కెరీర్ మొదట్నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతాఇంతా కాదు. అయితే ఒక్కోసారి వాస్తవానికి దూరంగా కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సృష్టిస్తుంటాయి. నా మటుకు నేను కూడా కొన్ని వార్తల కారణంగా కలత చెందిన సందర్భాలు లేకపోలేదు. మరోవైపు నా తప్పులను ఎత్తిచూపి, వాటిని నేను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కలిగించిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎంతోమంది లేకపోలేరు. నేను ఎక్కువగా గతంలో గొల్లపూడి, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానంద్ వంటి వారితో తరచూ మాట్లాడేవాడిని. రచయితలకు, జర్నలిస్టులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది.’ అని చెప్పుకొచ్చారు. పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ "నేను రాసిన పన్నెండవ పుస్తకం ఇది. జర్నలిస్టులగా మన చరిత్రను మనం ఎందుకు చెప్పుకోకూడదు అన్న ఆలోచన నుంచి పుట్టిన పుస్తకం ఇది. టాకీ కాలం మొదలైనప్పట్నుంచి నాటి సినీ జర్నలిస్టుల మొదలుకుని నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని ఇందులో అందించాను.
‘తెలుగింటి సంస్కృతి’ కి మంచి రెస్పాన్స్..
టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ‘పెళ్లాం ఊరెళితే‘, ‘ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన సినీ నటి ప్రశాంతి హారతి (Prashanthi Harathi) కూతురు తాన్యా హారతి లేటెస్ట్ మ్యూజిక్ వీడియోతో అదరగొడుతోంది. తెలుగింటి సంస్కృతి అనే మ్యూజిక్ వీడియోను కేకేఆర్ వర్క్స్ య్యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేయగా తాజాగా 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. నటి ప్రశాంతి హారతి విదేశాల్లో అభినయ కూచిపూడి అకాడెమీ స్థాపించి ఇండియన్ క్లాసికల్ డాన్స్ ల్లో శిక్షణ ఇప్పిస్తోంది. ఆమె కూతురు తరుచూగా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. నిర్మాత రాధా కృష్ణ హారతి ఈ విజయానికి దోహదపడిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రాక్షస కావ్యం ప్రెస్ మీట్..
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రాక్షస కావ్యం’ (Raakshasa Kaavyam). గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. ఈ నెల 13న రిలీజ్ కాబోతుండటంతో యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో అభయ్ నవీన్ మాట్లాడుతూ- నేను ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానన్నారు. డైరెక్టర్ శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ బడ్జెట్ వైజ్ చిన్న సినిమా అయిన ఇది కంటెంట్ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయుల పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుందనే ఊహతో రాసుకున్న స్క్రిప్ట్ ఇది ఈ కాన్సెప్ట్ లో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని క్లారిటీ ఇచ్చారు. నిర్మాత దామురెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాను ప్రయోగాత్మకంగా చేశాం. సినిమాలో ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. కార్యక్రమంలో యాక్టర్ యాదమ్మ రాజు, హీరోయిన్ కుశాలిని, హీరో అన్వేష్ మైఖేల్ కూడా పాల్గొన్నారు.
కార్తిక్ రత్నం ‘లింగొచ్చా’ రిలీజ్ డేట్..
యంగ్ హీరో కార్తిక్ రత్నం, సుప్యర్ద సింగ్ హీరోహీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘లింగోచ్చా’ (Lingoccha). ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆనంద్ బడాని దర్శకుడు. శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల అక్టోబర్ 27న విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని జె నీలిమ సమర్సిస్తుండగామల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా నిర్వహిస్తున్నారు. ఆనంద్ బడా మాట్లాడుతూ.. లింగోచ్చా గేమ్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది. హైదారాబాద్ కి సంబంధించిన రొమాంటిక్ కామెడీ విత్ లవ్ తో ఈ కథ నడుస్తుంది.