Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ లో అల్లు అర్జున్ బిజినెస్.. భారీగా ప్లాన్ చేస్తోన్న ఐకాన్ స్టార్..

టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల నుంచి కోట్లకు కోట్లు సంపాదిస్తూనే.. ఆ డబ్బును బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రకరకాల బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా వైజాగ్ లో ఐకాన్ స్టార్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 
 

Tollywood Icon Star Allu Arjun Business Plane In Visakhapatnam JMS
Author
First Published Mar 19, 2024, 2:31 PM IST

టాలీవుడ్ హీరోలు కోట్లకు కోట్లు సంపాదిస్తూ..ఆడబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలయిన మహేష్ బాబు, విజయ్ దేవరకొండతో పాటు... అట్లు అర్జున్ కూడా థియేటర్ రంగంలోకి దిగడం మనకు తెలిసిందే.  మన హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లలో దిగి సక్సెస్ అవుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లో ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి మన హీరోలు థియేటర్స్ మొదలుపెడుతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో మహేష్ బాబు  మల్టీప్లెక్స్, అల్లు అర్జున్ AAA సినిమాస్, విజయ్ దేవరకొండ  మహబూబ్ నగర్ లో AVD సినిమాస్.. పేర్లతో మల్టీప్లెక్స్ లు మొదలుపెట్టి దూసుకెళ్తున్నారు.

ఈమల్టీప్లెక్స్ ల ఐడియాలు  సక్సెస్ అవుతుండటంతో.. త్వరలో రవితేజ కూడా ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ హైదరాబాద్ దిల్‌షుఖ్ నగర్ లో ప్రారంభించబోతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకాస్త ముందడుగు వేశాడు  అల్లు అర్జున్. తన AAA సినిమాస్ బిజినెస్ ని విస్తరించబోతున్నాడు. అది కూడా హైదరాబాద్ లో కాదు.. రాష్ట్రం దాటి పక్క రాష్ట్రంలో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. వైజాగ్ లో తన AAA ని మొదలుపెట్టబోతున్నారు. ఇటీవల పుష్ప సినిమా షూట్ కోసం బన్నీ వైజాగ్ కి వెళ్తే అక్కడ అభిమానులు భారీగా వచ్చి ర్యాలీ తీసుకెళ్లారు. వైజాగ్ లో కూడా సినిమా బిజినెస్ భారీగా నడుస్తుంది.

త్వరలో వైజాగ్ లో ఇన్‌ఆర్బిట్ మాల్ రానుంది. ఈ మాల్ లో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ తో కలిసి AAA సినిమాస్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారుట. త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు అని తెలుస్తుంది. హైదరాబాద్ AAA సినిమాస్ చూడటానికి చాలా లగ్జరీగా, క్లాసీ లుక్స్ తో, అల్లు అర్జున్ ఫొటోలతో చాలా బాగుంటుంది. అదే రేంజ్ లో వైజాగ్ లో కూడా ప్లాన్ చేస్తుండటంతో ఆంధ్రా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారట. 

Follow Us:
Download App:
  • android
  • ios