టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్ లో పాపులర్ అయ్యి.. టాలీవుడ్ లో స్టార్లు గా మారి.. బాలీవుడ్ కోసం తారాడుతున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో అద్దె ఇళ్లల్లో ఉంటూ.. అవకాశం వస్తే.. ముంబయ్ లో ఇల్లు కట్టుకుంటున్నారు బ్యూటీస్. తాజాగా నివేదా పేతురాజ్ కూడా ముంబయ్ లో ఇల్లు కొనేసిందట.. మరి మకాం బాలీవుడ్ కు మార్చబోతుందా..?
నివేదా పేతురాజ్ రీసెంట్ గా ఓ విషయం వెల్లడించి షాక్ ఇచ్చింది. తాను ముంబయ్ లో ఇల్లు కొనుగోలు చేసినట్టు చెప్పింది బ్యూటీ. తెలుగు సినిమాలతో ఓ మోస్తర్ హీరోయిన్ గా ఇమేజ్ సాధించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా విశ్వక్ సేన్ తో ధమ్కీ మూవీలో నటించి మెప్పించింది. ఈక్రమంలో ఈ బ్యూటీ.. హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ఇల్లు కొన్నానని చెప్పి సర్ప్రైజ్ చేసింది. పైగా ఇప్పటిదాకా నివేదా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గానీ, స్టార్ హీరోలతో సినిమాలు కాని లేవు. టాలీవుడ్ లోనే లేవంటే బాలీవుడ్ లో సినిమాలు ఏముంటాయి చెప్పండి. అయితే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ అవకాశాలు ఎక్కువగా అందుకుంటుంది నివేదా.
ఆ వచ్చే చిన్నా చితకా అవకాశాలు నివేదకు టాలీవుడ్ నుంచే ఎక్కువగా ఉన్నాయి. కాని ఇక్కడ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూనే.. నివేదా ఏకంగా ముంబైకి మకాం మార్చబోతుందట. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది బ్యూటీ. ఇటు టాలీవుడ్ లో దాస్ కా ధమ్కీ మూవీతో హిట్ కొట్టేసింది. అయితే వెబ్ సిరీస్ తోనే బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటుంది నివేదా. అందుకే ఏకంగా ముంబయ్ లో ఇల్లు కూడా కొనేసింది. త్వరలో అక్కడికి మకాం కూడా మార్చనున్నట్లు ఆమె తెలిపింది.
అయితే ముంబైలో ఇల్లు కొనడంపై స్పందించింది నివేదా పేతురాజ్. ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇల్లు కొనడానికి చాలా ట్రై చేశాను. కానీ కుదరలేదు. అందుకే ముంబయ్ లో ఇల్లు కోన్నాను అన్నారు. అయితే టాలీవుడ్ లో హీరోయిన్ గామంచి ఇమేజ్ సాధించిన ఆమె బాలీవుడ్ వైపు చూడటంపై విమర్షలు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి స్టార్ డమ్ సాధించి ముంబయ్ కి మకాం మార్చిన వారు చాలా మంది ఉన్నారు. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖాన్నా, పూజా హెగ్డే, రష్మికా మందన్నా, ఇలా చాలామంది టాలీవుడ్ కు హ్యాండ్ ఇచ్చి బాలీవుడ్ కు చేరుతున్నవారే.
అంతకు ముందు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేసి బాలీవుడ్ చేరినవారు చాలా మంది ఉన్నారు. కత్రీనా కైఫ్, కృతీ సనన్ లాంటి వారు టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా చేసి.. హిట్ కొట్టి.. టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ చేరినవారే. అయితే ఈ లిస్ట్ లో తమన్నా, రకుల్, పూజా హెగ్డే, రష్మిక లాంటి కొంత మంది ఇప్పటికే ముంబయ్ లో సోంతిల్లు కొనేశారు. హైదరాబాద్ లో లో మాత్రం హోటళ్లు.. అద్దె ప్లాట్లతో మానేజ్ చేసేస్తున్నారు.
