హీరోలతో పాటు.. హీరోయిన్లు కూడా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. సొంత బ్రాండ్స్ ను స్టార్ట్ చేస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నారు. ఈక్రమంలో సీనయిరన్ హీరోయిన్ భూమిక కాస్త లేటుగా అయినా కళ్ళు తెరుచుకుంది.. తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి దిగింది.
సినిమా తారలు ఇండస్ట్రీనుంచి వచ్చిన సంపాదనతో పాటు.. బయట సొంత బిజినెస్ ల ద్వారాకూడా సంపాదించుకోవడం సహజమే. ఈ ఫార్ములా ఫాలో అవ్వకుండా.. ఆర్ధికంగా దెబ్బతిని ఇబ్బందులు పడ్డ వారు చాలామంది ఉన్నారు. హీరోలతో పాటు.. హీరోయిన్లు కూడా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. సొంత బ్రాండ్స్ ను స్టార్ట్ చేస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నారు. ఈక్రమంలో సీనయిరన్ హీరోయిన్ భూమిక కాస్త లేటుగా అయినా కళ్ళు తెరుచుకుంది.. తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి దిగింది.
టాలీవుడ్ సినిమాతోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై భ్యూటీ భూమిక చావ్లా. యువకుడు అనే తెలుగు సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత సినిమా సూపర్ హిట్ కోట్టింది భూమిక. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడీగా ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వాసు, ఒక్కడు, సింహాద్రి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్‌గా మారింది. దాదాపు పదేళ్లు తెలుగు తెరను ఏలింది బ్యూటీ. తెలుగుతో పాటు.. సౌత్ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న భూమిక చావ్లా.. తాజాగా హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భూమిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇండియాలోని టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ గోవాలో భూమిక తన కొత్త హోటల్‌ను ప్రారంభించింది. ”గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్ అంటూ భూమిక ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. ఇక ఇది చూసిన అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
ఇక చాలా కాలం సినిమాలకు దూరం అయిన భూమిక.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ భూమిక వరుస సినిమాలతో చెలరేగిపోతుంది. రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తోన్న ఎమర్జెన్సీ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది. ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి పాత్రలుసాధిస్తూ దూసుకుపోతోంది భూమికా చావ్లా. తెలుగులో కూడా వరుసగా అవకాశాలు ఆమె తలుపుతుడుతన్నాయి.
