సినిమాల్లో కొందరు బహిరంగంగా రాజకీయపార్టీలకు మద్దతు ఇస్తే ..మరికొందరు సీక్రెట్ గా సపోర్ట్ ఇస్తూంటారు. అలాగే తెలుగులో కొందరు హీరోలు డైరక్ట్ గా తాము ఫలానా పార్టీ వాళ్లం అని చెప్పకపోయినా ...తన ఇన్నర్ సర్కిల్స్ లో రాజకీయాలను డిస్కస్  చేస్తూండటం, తాము అనుకున్న పార్టీ గెలిస్తే పార్టీలు ఇవ్వటం లేకుంటే బాధపడటం వంటి వి చేస్తూంటారు. ఇప్పుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యిన సందర్బంగా తెలుగులో వెలుగుతున్న ఓ యంగ్ హీరో తన బాగా క్లోజ్ సన్నిహితులు కొందరికి పార్టీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.  

అయితే బయిటకు ఎక్కడా తాను ఫలానా పార్టీ కు చెందిన వాడినని కానీ, మద్దతు ఇస్తానని కాని చెప్పడా హీరో. అంతేకాదు వేరే పార్టీకు బహిరంగంగా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేసారు. కానీ లోలోపల మాత్రం ఆ పార్టీ ఓడిపోయిందని ఆనందపడి, జగన్ గెలిచినందుకు ఆనందంలో మునిగిపోయాడట. 

ఇండస్ట్రీ నుంచి కేవలం ఇద్దరిని మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానిస్తున్నారట. ఎట్టిపరిస్దితుల్లోనూ తన పేరు బయిటకు రావటానికి వీల్లేదని తన వాల్లకు కండీషన్ పెట్టాడట. అయితే ఎందుకు బహిరంగంగానే వైయస్ జగన్ కు సపోర్ట్ చేయిచ్చు కదా అంటే తన అభిమానుల్లో చాలా మంది తెలుగుదేశం, జనసేన అభిమానులు ఉన్నారని, వారిని పోగొట్టుకోవటం ఇష్టం లేక అని శెలవిచ్చాడట. అదీ సంగతి.  ఇంతకీ ఆ హీరో ఎవరో గెస్ చేయగలిగారా..