Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ లింగు స్వామికి క్షమాపణలు చెప్పిన హీరో రామ్, ఇంతకీ అసలు ఏం జరిగింది..?

ఇస్మార్ట్ హీరో రామ్ పోతీనేని డైరెక్టర్ లింగుస్వామికి క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ కు సారీ చెప్పాడు రామ్. ఇంతకీ రామ్ ఎందుకు లింగు స్వామికి క్షమాపణలు చెప్పాడు. అసలేం జరిగింది..? 

Tollywood Hero ram says sorry to director linguswamy
Author
Hyderabad, First Published Jun 23, 2022, 1:51 PM IST

హీరో రామ్ ప్రస్తుతం ది వారియర్ మూవీ తో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా సినిమాలోని విజిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సందర్బంగా ఏర్పటు చేసిన కార్య క్రమంలో హీరో రామ్ అందరి గురించి తెలిపి..డైరెక్టర్ గురించి చెప్పడం మరచిపోయాడు. 

ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న ది వారియర్‌. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన జూలై 14న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో విజిల్‌.. విజిల్‌.. అంటూ  సాగే పాటను సోషల్‌ మీడియా వేదికగా స్టార్‌ హీరో సూర్య రిలీజ్‌ చేశాడు. ఇక ఈ పాట లాంచింగ్‌ వేడుకలో రామ్‌ మాట్లాడుతూ.. విజిల్‌ సాంగ్‌ తనకు బాగా నచ్చిందని చెప్పాడు.

తమ చిత్రానికి మంచి ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ అందించి దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్స్‌, నిర్మాతలతో పాటు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఈ సినిమా సృష్టికర్త అయిన దర్శకుడు లింగుస్వామి గురించి మాత్రం రామ్‌ ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం రామ్‌ ట్వీట్‌ చేస్తూ డైరెక్టర్‌ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. 

 

 

ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్‌, డైరెక్టర్‌ లింగుస్వామి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని మీరు మీ భుజాలపైకి ఎత్తుకున్నారు. ఇప్పటివరకూ నేను పనిచేసిన ఉత్తమమైన దర్శకుల్లో మీరూ ఒక్కరిగా ఉన్నందుకు ధన్యవాదాలు. సారీ అండ్‌ లవ్‌ యూ” అని రామ్‌ రాసుకొచ్చారు.రామ్‌ పెట్టిన ట్వీట్‌పై లింగుస్వామి స్పందించారు. నాతో కలిసి పనిచేయడాన్ని నువ్వు ఎంతలా ఇష్టపడ్డావో నాకు తెలుసు. అలాగే, సినిమా చూసిన అనంతరం ఆత్మీయంగా నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావ్‌ కదా.. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మనం మరింత దూరం ప్రయాణించాలని కోరుకుంటున్ని అని రిప్లయ్ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios