Asianet News TeluguAsianet News Telugu

హనుమాన్ దీక్షలో హీరో నితిన్.. ‘బాబాయ్ హోటల్’ ప్రారంభోత్సవంలో స్టార్ హీరో సందడి!

టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం అంజన్న దీక్షలో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లోని మణికొండలో ఫేమస్ బాబాయ్ హోటల్ ప్రారంభోత్సవానికి ‘భీష్మ’ దర్శకుడితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 

Tollywood hero nithiin launched babai hotel in Manikonda!
Author
First Published Jan 22, 2023, 2:43 PM IST

‘మాచెర్ల నియోజకవర్గం’తో అభిమానులను అప్సెట్ చేసిన  టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తన 32వ చిత్రంలో నటిస్తున్నారు. ఇక నితిన్ ప్రస్తుతం అంజన్న దీక్షలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాషాయపు దుస్తుల్లో నయా లుక్ లో కనిపించారు. తాజాగా హైదరాబాల్ లోని మణికొండలో లాంచ్ చేసిన ‘బాబాయ్ హోటల్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల, వక్కంతం వంశీతో  కలిసి  ముఖ్య అతిథిగా హాజరైనట్టు తెలుస్తోంది. 

ఎనిమిది దశాబ్దాల నుంచి విజయవాడలో ‘బాబోయ్ హోటల్’ రుచికరమైన భోజనాన్ని అందిస్తూ వస్తోంది. ఇక ఈ ఫుడ్ చైన్ హైదరాబాల్ లోనూ ప్రారంభమైంది. తాజాగా మణికొండలో  ‘బాబాయ్ హోటల్’ బ్రాంచ్‌ను స్టార్ హీరో నితిన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైద్రాబాద్‌లోని మణికొండకు తీసుకొచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు పాల్గొని నిర్వాహకులకు బెస్ట్ విషెస్ తెలిపారు.

కాగా, నితిన్ - వక్కంతం వంశీ కాంబినేషన్ లో Nithiin32 చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇక దీని తర్వాత మరోసారి వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా హోటల్ ప్రారంభోత్సవంలో వెంకీ కుడుమలతో కనిపించడంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో సెట్ అయ్యిందనేందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. వీరిద్దరి కాంబోలో ‘భీష్మ’ వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios